YS Jagan: జిల్లాల బాట పట్టనున్న వైయస్ జగన్… సంక్రాంతి తరువాత పర్యటన షూరు!

YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే జిల్లాల బాట పట్టనున్నారు. ప్రతి జిల్లాలోను ఈయన రెండు రోజులపాటు పర్యటించబోతున్నట్లు ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. సంక్రాంతి తర్వాత నుంచి ఈ పర్యటన మొదలవుతుందని జగన్ తెలిపారు. పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు.

సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రతి బుధుడు గురువారాలలో తాను పార్లమెంటు పరిధి జిల్లాలలోనే బసచేస్తూ అక్కడ కార్యకర్తలు నేతలతో మాట్లాడి ప్రతి ఒక సమస్యను అడిగి తెలుసుకుంటానని తెలిపారు. ఇక పార్టీలో వివిధ భాగాలకు నియామకాలను పూర్తి చేసి గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను వీడియో తీసి అప్లోడ్ చేయాలని తెలిపారు.

ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి బుధవారం మూడు నియోజకవర్గాలలోను గురువారం నాలుగు నియోజకవర్గాల నేతలతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేర్లతో ముందుకు వెళ్తాం. ఆ ప్రోగ్రామ్ ముఖ్య అజెండా.. మండల స్థాయి కల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని మా వాళ్లకు చెప్పాం. పార్టీ పటిష్టత కోసం కమిటీలు ఏర్పాటవుతున్నాయి.

మనలో పోరాటం ఏమాత్రం సన్నగిల్ల కూడదు ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి ఆ కష్టాలన్నీ ఎదుర్కొని విజయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ సమస్యలను తెలుసుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వ పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటామని ఈ సందర్భంగా జగన్ పార్టీ నేతల సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Ys Jagan Sensational Comments | జిల్లాల్లో పర్యటిస్తా..అందరినీ కలుస్తా: జగన్‌ | 10TV News