దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నేతలు, అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. ఆయన తనయుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అన్నవరంలో ఆయన పాదయాత్ర సాగుతోంది. అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం తన తండ్రి విగ్రహానికి పూలమాల వేశారు జగన్. ఆ తర్వాత కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జగన్ వెంట ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు.
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జగన్ తన ట్విట్టర్ ఖాతాలో తండ్రిని స్మరించుకుంటూ ఒక పోస్టు పెట్టారు. “నాన్న వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన ఆశయాలే నాకు మార్గ దర్శనం. ఆయన ఆశయ సాధనం కోసం నా జీవితం అంకితం చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు జగన్.
Remembering nanna on his vardanthi. His ideals have been a guiding light and have carved a path for me, that I promise to dedicate my life to pursue. #YSRVardhanthi pic.twitter.com/RAuhjFjlmm
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2018