వైఎస్ జగన్ ప్రభుత్వం విశాఖ మీద గట్టిగా దృష్టి పెట్టింది. త్వరలో ఆ జిల్లాను పాలన రాజధానిగా చేస్తుండటం మూలాన ప్రభుత్వం ముందస్తు చర్యలను వేగవంతం చేసింది. వైజాగ్ ఇప్పుడు రాజధాని అవుతున్నా కూడ మొదటి నుండి ఆర్థికంగా బలమైన ప్రాంతమే. అన్ని రకాల వనరులు, ఆహ్లాదకరమైన భౌగోళిక పరిస్థితులు ఉండడటం, నివాసానికి, వ్యాపారాలను అనువైన చోటు కావడంతో అక్కడ రియల్ ఎస్టేట్ జోరుగానే నడుస్తూ ఉండేది. ఎక్కడైతే అబ్బివృద్ది ఉంటుందో అక్కడే అవినీతి కూడ ఉంటుందనేది బేసిక్ ఫార్ములా. అందుకే విశాఖలో భూదందాలు భారీగా జరిగాయి. దేవుడి భూములను వదలని ఘనులు కూడ ఉన్నారు. పదవిలో ఉన్న కొందరు, పలుకుబడి కలిగిన ప్రైవేట్ వ్యక్తులు కొందరు వైజాగ్ భూములను అప్పనంగా మింగేశారు. వాటి విలువ వేల కోట్లలోనే ఉంటుందని అంచనా.
ఇన్నాళ్లు ఇవి బయటకు రాలేదు కానీ జగన్ వచ్చి రాజధాని మార్పుకు శ్రీకారం చుట్టడంతో భూ దందాలు బయటపడ్డాయి. ఎటు చూసినా సివిల్ కేసులే. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ లెక్కలు కూడ తికమకగా ఉండేవి. వాటన్నింటినీ కూపీ లాగడం స్టార్ట్ చేసిన జగన్ సర్కార్ కొందరు నేతల మీద ఇప్పటికే కొరడా ఝళిపించింది. సబ్బం హరి, గీతం యూనివర్సిటీ శ్రీభరత్ లాంటి టీడీపీ నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించారని కూల్చివేతలుకూడ జరిగాయి. ఇక మరొక ముఖ్య నేత గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన కొంత భూమిని సీజ్ చేశారు. ఏడాది క్రితమే ప్రభుత్వం భూఆక్రమణల మీద దృష్టిపెట్టి సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ బృందం విచారణ చివరి దశకు వచ్చింది.
ఆ విచారణలో చాలామంది పొలిటికల్ లీడర్లు, బిగ్ షాట్స్ పేర్లు బయటపడ్డాయట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత భూమిని మింగారు అనే అంశమై ప్రస్తుతం పూర్తి నివేదిక రెడీ అవుతోందట. అది పూర్తైన వెంటనే నేరుగా ముఖ్యమంత్రి టేబుల్ మీదకు వెళుతుంది. విశాఖను రాజధానిగా చూడాలని బలంగా భావిస్తున్న జగన్ అలాంటి చోట అక్రమాలకు తావు ఉండకూడని నిర్ణయించుకున్నారు. అందుకే విచారణలో ఎవరి పేరు బయటపడినా నిర్మొహమాటంగా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారట. దీంతో వైజాగ్ బిగ్ షాట్స్ గుండెల్లో రెళ్ళు పరిగెడుతున్నాయట. మరి జగన్ ఉచ్చుకి చిక్కిన ఆ భూతిమింగలాలు ఎవరెవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరీ ముఖ్యంగా టీడీపీ నేతలైతే ఏ కేసు వచ్చి మెడకు చుట్టుకుంటుందోనని వణికిపోతున్నారట.