2019 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మెహన్ రెడ్డి మొదట్లో పాలన విషయంలో కాస్త తడబడినా ఇప్పుడు మాంచి ఫామ్ లో ఉన్నారు. గతంలో తనతో ఆడుకున్న టీడీపీ నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. తనను ఏ సీబీఐ కేసులైతే అడ్డు పెట్టుకుని ఇంత కాలం ప్రత్యర్థులైన చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు విమర్శిస్తున్నారో ఇప్పుడు అవే అస్త్రాలను వాళ్లపై ప్రయోగించేందుకు సీఎం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సీబీఐ ఉచ్చు బిగించేందుకు జగన్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించినట్టు ప్రభుత్వ పనితీరు తెలియజేస్తోంది. ఈ ఉచ్చుకు లోకేష్ దొరకడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
లోకేష్ తప్పు చేశాడా?
టెలి కమ్యూనికేషన్ డిపార్టుమెంట్‌కు, భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్‌కు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర fyber నెట్ వర్క్ కు మధ్య అవగాహనా ఒప్పందం (MOU) జరగడంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడైన నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు సంబంధం ఉందని, భారత్ ఫేస్ 2 కింద చేపట్టే ఈ పనులను రూ 907.94 కోట్లకు పెంచుకున్నట్టు వైసీపీ వర్గాలు చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే క్యాబినెట్సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
సబ్ కమిటీ ఏమి చెప్తుంది?
ఆంధ్ర ప్రదేశ్ ఫైబర్ నెట్ లో 2014-2019 మధ్య జరిగిన అవినీతి పై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని కోరడం కలకలం రేపుతోంది. తాజా పరిణామాలు టీడీపీ వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఆల్రెడీ ఈ అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపి రూ.2000 కోట్లు దాటి మళ్లినట్టు నిర్ధారించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు కూడా నివేదించింది. ఇలా వైసీపీ నాయకులు వేస్తున్న వలకు నారా లోకేష్ చిక్కుతారో లేదో చూడాలి. ఒకవేళ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను సీబీఐ నిజమని తెలిస్తే రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు