YS Jagan: 2024 ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి లో మార్పు వచ్చిందా అంటే వచ్చిందని చెప్పాలి. 2019 ఎన్నికలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సింగల్ గా ఎన్నికల బరిలో దిగి ఏకంగా 151 స్థానాలలో విజయం సాధించారు. ఇలా అధికారంలోకి వచ్చిన జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందజేస్తూ 2024 ఎన్నికలలో 175 స్థానాలలో విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు అయితే అదే విధంగా అంచనాలు కూడా ఉన్నాయి కానీ కూటమి పార్టీలన్నీ ఏకం కావడంతో జగన్ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.
గతంలో పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడు తమదైన శైలిలో స్పందించేవారు ఆ పార్టీ నేతలు. ఆ అంశంపై ఇప్పుడు స్వరం మారినట్టు కనిపిస్తోందా? పొత్తుల కోసం వెంపర్లాడుతోందా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అనే విషయంపై కార్యకర్తలలో కూడా చర్చలు జరుగుతున్నాయి ఇక త్వరలోనే జమిలి ఎన్నికలు కూడా రాబోతున్నాయి అనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో క్యాడర్ మొత్తాన్ని అలర్ట్ చేసే పనిలో వైసిపి నేతలు ఉన్నట్టు తెలుస్తుంది.
జమిలి ఎన్నికలు ముందుగా రావన్న విషయం అందరికీ తెలుసు. పొత్తుల ప్రస్తావన వచ్చేసరికి సింహం సింగిల్‌గా వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పెద్ద డైలాగ్స్ చెప్పేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఈసారి మాత్రం సింహం వెనకడుగు వేసిందని జరగబోయే ఎన్నికలలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వైసిపి ఎదురుచూస్తుందని తెలుస్తుంది.
సింహం సింగిల్‌గా వెళ్లి 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ స్థాయికి పడిపోవడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారనుకోండి.. అయితే 11 స్థానాలు మాత్రమే రావడంతో నాయకులకు అసలు విషయం బోధపడిందని అందుకే వచ్చే ఎన్నికలలో పొత్తుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది మరి వచ్చే ఎన్నికలలో వైసీపీ ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుందా లేకపోతే మరోసారి సింహం సింగిల్ అనే డైలాగ్ వినిపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
