వైసిపి జగన్ కు మరొక షాక్…

 పార్టీ బాగా బలపడుతూ ఉందని అనుకుంటున్న సమయంలో  నెల్లూరు జిల్లాలో వైసిపికి   పెద్ద షాక్ తగిలింది. బహుశా పార్టీ పాదయాత్ర జోష్ మీద ఉన్న జగన్ కు ఇలాంటి షాక్ ఎదురవుతుందని ఎవరూ వూహించరు. విజయవాడ సెంట్రల్ షాక్ తర్వాత ఇదొక భారీషాక్.

అంతే, రాజకీయాలలో షాక్ లుంటాయి.ఇపుడేమయిందంటే… నెల్లూరు జిల్లా పార్టీ పెద్దల్లో ఒకరయిన జిల్లా పరిషత్  ఛైర్మన్‌ బొమ్మిడిరెడ్డి రాఘవేంద్రారెడ్డి  పార్టీ గుడ్ బై కొట్టారు. తనకు పార్టీలో అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నారు. పార్టీ కోసం తాను శక్తి వంచనలేకుండా చేశానని, అయినా వైసీపీ అధినేత తనను అగౌరపరిచారని  రాఘవేంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొడవ కంతంటికి కారణం, ఆనం రామ్ నారాయణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే.  పార్టీలో చేర్చుకోవడమే కాదు,   ఆనంను  ఏకంగా వెంకటగిరిఅసెంబ్లీ నియోజకవర్గం  ఇన్ ఛార్జిగా నియమించారు. ఇది చాలా  మంది నేతల్లో అసంతృప్తికి కారణమయింది. అయితే, మొదట బయటపడంది రాఘవేంద్రరెడ్డియే.  ఇది భరించలేక ఆయన  ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. ‘పార్టీ అధినేత జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు’ అని తీవ్ర ఆరోపణ చేశారు.  ఆత్మగౌరవం లేనిచోట నేనెలా ఉండగలను అని అన్నారు.  ఆనం ను పార్టీచేర్చుకునే విషయంలో అధినేత జగన్ సీనియర్ అయిన  తనకు కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన చెందారు. తన నిర్ణయాన్ని   జడ్పీ సభ్యులు వ్యతిరేకిస్తే, చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్దం అని ఆయన ప్రకటించారు.