వైఎస్ జగన్, షర్మిల.! ఆ ఇంట్లో చిచ్చు పెట్టిన రాజకీయం.!

వాళ్ళది రక్త సంబంధం.! అయితేనేం, రాజకీయాల్లో అలాంటివేవీ వుండవ్.! రాజకీయం కంటే, కుటుంబ సంబంధాలేమీ గొప్పవి కావని ఇప్పుడున్న రాజకీయాలు చెప్పకనే చెబుతున్నాయి.!

వైఎస్ షర్మిల తన రాజకీయం తాను చూసుకుంటున్నారు. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని పెట్టారు, దాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఏ కాంగ్రెస్ పార్టీతో అయితే పంచాయితీ పెట్టుకుని, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వైఎస్ జగన్ వచ్చారో, అదే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల కలిసిపోవడం సహజంగానే వైఎస్ జగన్ అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తుంటుంది.

అయితే, వైఎస్ షర్మిల స్వయానా వైఎస్ జగన్ సోదరి అన్న విషయాన్ని వైఎస్ జగన్ అభిమానులు మర్చిపోయారు. వైఎస్ షర్మిల ఇంటి పేరుని మార్చేశారు. షర్మిల రెడ్డి కాదు, షర్మిల శాస్త్రి అంటూ ఎగతాళి చేశారు.

కానీ, ఏమయ్యిందిప్పుడు.? జగన్ తన సోదరి ఆహ్వానం మేరకు, మేనల్లుడి ఎంగేజ్మెంట్‌కి హాజరయ్యారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంటే, మళ్ళీ వైఎస్ జగన్ అభిమానులే జగన్ – షర్మిల అనుబంధం గురించి కవరింగ్ ఇచ్చుకోవాల్సి వస్తోంది.

గతంలో పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్, చిరంజీవి – పవన్ కళ్యాణ్ మధ్య పొరపచ్చాలంటూ సోషల్ మీడియా ట్రోలింగ్ జరిగినా, వాళ్ళంతా కలిసే వున్నారు. అసలెందుకీ సోషల్ ట్రోలింగ్.. అదీ, కుటుంబాల్లో చిచ్చు పెట్టేలా ఈ వెకిలితనం.? ఇదేమీ మిలియన్ డాలర్ క్వశ్చన్ కాదు.

కొంతమంది వుంటారు.. వాళ్ళకి పనీ పాటా ఏమీ వుండదు. అదే అసలు సమస్య. రాజకీయంగా షర్మిల – జగన్ మధ్య విభేదాలు వుండొచ్చు. అవి కుటుంబ విభేదాలుగా మ మారతాయని ఎలా అనుకోగలం.? బాలకృష్ణ – జూనియర్ ఎన్టీయార్ విషయంలో అయినా అంతే.!