2019 ఎన్నికల్లో సాదించిన విజయం యొక్క ఆనందాన్ని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొంతకాలం కూడా ఉండలేదు. ఈ ఆనందం కొంతవరకు కోర్ట్ ల్లో తగులుతున్న ఎదురు దెబ్బల వల్ల పోతుంటే మిగిలిన కొంత ఆనందం వైసీపీ నాయకులు చేస్తున్న చిల్లర పనుల వల్ల పోతుంది. వైసీపీ నాయకులు చేస్తున్న మోసాలు, అక్రమాలు టీడీపీ అధినేత నిత్యం మీడియా ముందు చెప్తూనే ఉన్నారు. ఇలా వైసీపీ నాయకులు చేస్తున్న చెత్త పనుల వల్ల సీఎం జగన్ మోహన్ రెడ్డి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను, మోసాలను తెలుసుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి కూడా పార్టీ నేతలపైనే ఆధారపడవలసి వస్తుంది.
ఆ సమాచారం ఇచ్చే వారిపై కూడా జగన్ కు నమ్మకం లేకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి తనకంటూ ఒక సొంత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నిఘా వ్యవస్థ వల్ల పార్టీ నేతలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ఇటీవల ఒక ఎమ్మెల్యే కు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆ ఎమ్మెల్యే ఉత్సాహంగా వెళ్లారట. అయితే మూడు గంటలు వెయిట్ చేసిన తర్వాత జగన్ నుంచి పిలుపు రావడంతో తనకు శుభవార్త చెబుతారనుకుని మురిసిపోయారు. కానీ ఇసుక తవ్వకాలు, ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూములు ఎక్కడెక్కడ ఎప్పుడు కొనుగోలు చేసిందీ జగన్ చెప్పడంతో ఆ ఎమ్మెల్యే అవాక్కయ్యారట. జగన్ క్లాస్ పీకి పపండంతో బతుకు జీవుడా అని ఆ ఎమ్మెల్యే బయటపడ్డారట. ఇలా జగన్ మోహన్ రెడ్డి తాము చేస్తున్న అక్రమాల గురించి చెప్తుండటంతో వైసీపీ నేతలు బిత్తరపోయి చూస్తున్నారు. ఇంతకుముందు వరకు జగన్ నుండి కాల్ వస్తే పార్టీ నేతలు సంతోషంతో ఊగిపోయేవారు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి నుండి కాల్ వచ్చిందంటే భయపడిపోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ నిఘా వ్యవస్థ వల్ల పార్టీ నేతలు చేస్తున్న అక్రమాలను అడ్డుకుంటు టీడీపీ నేతలకు చెక్ పెట్టబోతున్నారు. పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం జగన్ మోహన్ రెడ్డి నుండి కాల్ రాకూడదని దేవుడికి ప్రార్థిస్తున్నారు.