ఆళ్ళ నాలుగో మంత్రి

అవును మంగళగిరిలో పోటీ చేస్తున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మంత్రపదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అదికూడా నియోజకవర్గంలో జరిగిన రోడ్డు షోలో జగన్ బహిరంగంగా ప్రకటించారు. తాజా ప్రకటనతో ఇప్పటి వరకూ నలుగురికి మంత్రి పదవులను హామీ ఇచ్చినట్లైంది. జగన్ ఇస్తున్న హామీలు కూడా వైసిపి అధికారంలోకి వస్తేనే అమలవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే.

మొదటగా గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ కు జగన్ హామీ ఇచ్చారు.  దాదాపు నాలుగేళ్ళపాటు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గంలో బాధ్యతలు చూసిన జగన్ చివరి నిముషంలో విడదల రజనీకుమారికి టికెట్ ఇచ్చారు. అంతకు కొద్ది రోజుల ముందే రజనీని నియోజకవుర్గ సమన్వయకర్తగా నియమించారు. మర్రికి అనారోగ్య కారణాలతోనే తప్పించారని పార్టీ నేతలు చెప్పారు.

రజనీని సమన్వయకర్తగా నియిమించే ముందే మర్రితో జగన్ మాట్లాడారు. వైసిపి అధికారంలోకి రాగానే మర్రికి ఎంఎల్సీ పదవిని ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. తర్వాత  తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో పోటీ చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ కు కూడా ప్రకటించారు.

అలాగే ఒంగోలు రోడ్డు షో సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇక తాజాగా మంగళగిరిలో ఆళ్ళకు కూడా మంత్రి పదవి హామీ ఇచ్చారు. జగన్ హామీ ప్రకారం ఇద్దరు రెడ్లు, ఓ బిసి, ఒక కమ్మ నేతకు మంత్రి హామీలిచ్చారు. ఉండేదే 25 మంత్రిపదవులు. అందులో మొత్తం 25 ఒకేసారి భర్తీ చేయరు.  నిజంగానే వైసిపి అధికారంలోకి వస్తే ఓ 20 మందితో భర్తీ చేసినా ఇక  తీసుకోవాల్సింది 16 మందినే.  క్యాస్ట్ ఈక్వేషన్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి.