వైఎస్ వివేకా హత్య కేసును సిబిఐకి అప్పగించి విచారించాలని కోరుతూ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిజిపి ఠాకూర్ ల ప్రమేయం లేని స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
వివేకా హత్యను చిన్నదిగా చూపించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ హత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని పిటిషన్ లో ఆరోపించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల వాస్తవాలు బయటకు వస్తాయన్న నమ్మకం లేదని, అందుకే, స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసు విచారణను అప్పగించాలని జగన్ కోరారు. జగన్ పిటిషన్ బుధవారం లేదా గురువారం విచారణకు రానుంది.