జగన్ ఆపరేషన్ ఆకర్ష… టీడీపీలో కీలక నేతలు జంప్?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్.. తాజాగా పురందేశ్వరి కలిసి జగన్ పై అసత్య ఆరోపణలు చేయడం చేస్తోన్న సంగతి తెలిసిందే. మరికొన్ని సందర్భాల్లో పరుష పదజాలం వాడుతూ కూడా జగన్ ని విమర్శిస్తున్నారు. ఈ సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

అవును… ఏపీలో చంద్రబాబుకి బిగ్ షాకిచ్చేల జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా… ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేశారని అంటున్నారు. దీంతో టీడీపీకి చెందిన పలూరు నేతలు జగన్ కు టచ్ లోకి వెళ్లారని సమాచారం. ఈ మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలతో పాటు ఉత్తరాంధ్ర, రాయల్సీమ లోని కొంతమంది కీలక నేతలు ఫ్యాన్ కిందకు చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వైసీపీని టర్గెట్ చేస్తోంది. అధికార పార్టీలో చాలా మందికి టికెట్ గల్లంతు అవుతుంది కాబట్టి.. వారంతా వచ్చి తమ పార్టీలో చేరుతారు అని భావిస్తోంది. ఇదే సమయంలో జనసేన కూడా ఇదే రకమైన ఆలోచనలలో ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ ఒక అడుగు ముందుకు వేసింది. దీంతొ వైసీపీకి కూడా చాలా మంది ప్రతిపక్ష నేతలు టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు.

ఇలా వైసీపీ టచ్ లోకి వెళ్లిన.. వైసీపీకి టచ్ లోకి వచ్చిన వారిలో టీడీపీలోని కీలక నేతలతోపాటు బిగ్ షాట్స్ కూడా ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో… టీడీపీలో కొనసాగి రిస్క్ చేయడం కంటే… వైసీపీలోకి వెళ్లిపోయి రిలాక్స్ అవ్వడం బెటరని అంటున్నారని తెలుస్తోంది.

ఇదే సమయంలో టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తుల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చి.. మూడు పార్టీలూ కలిసి ఎన్నికల్లో పాల్గొంటే కచ్చితంగా తక్కువలో తక్కువగా 30 – 40 మంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాల్సి రావొచ్చు. దీంతో అందుకు ఏమాత్రం సిద్ధంగా లేని కొంతమంది టీడీపీ నేతలు.. ఈ మేరకు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ అయినా పర్లేదు అంటూ… అధికారపార్టీతో బేరసారాలు జరుపుతున్నారని సమాచారం.

దీంతో సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తోన్న జగన్… ఇవ్వాల్సిన హామీలు ఇవ్వడానికి కాస్త సమయం తీసుకున్నారని.. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ నెలాఖరు లోగా టీడీపీ కి పెద్ద షాకే తగలబోతోందని అంటున్నారంట. గెలుపు అనివార్యమైన ఈ సమయంలో నిజంగా టీడీపీ నుంచి బలమైన నేతలు,, పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే నాయకులు వైసీపీలో చేరితే మాత్రం… బాబుకు అది చావుదెబ్బే అవుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు!