లోకేష్ పై జగన్ ప్రత్యేక శ్రద్ధ… షాకిచ్చే లేటెస్ట్ స్టెప్ ఇదే!

వచ్చే ఎన్నికల్లో “వైనాట్ 175” లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఏపీ సీఎం జగన్… చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి అప్పగించిన జగన్… ఈసారి బాబుని ఇంటికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా… అసెంబ్లీ గేటు తాకనివ్వకూడదనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు చెబుతున్నారు.

ఈ సమయంలో చినబాబు లోకేష్ పైనా జగన్ ప్రత్యేక శ్రద్ధపెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంగళగిరిలో పరిస్థితులపై విజయసాయిరెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన జగన్… లోకేష్ ఓటమికి అవసరమయ్యే ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకుండా పగడ్భందీగా ప్లాన్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మరోసారి మంగళగిరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా… వైసీపీని వీడిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకోవ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. వాస్తవానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీని వీడిన సమయంలో… మంగ‌ళ‌గిరి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని నియ‌మించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై సొంత సామాజిక వ‌ర్గం చేనేత‌ల్లో ఆశించిన స్థాయిలో సానుకూల‌త లేద‌ని నివేదిక‌లు అందాయని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో… మంగళగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మార్పుపై జ‌గ‌న్ పున‌రాలోచ‌న చేస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల‌ను బ‌రిలో దింపాల‌ని సీఎం భావిస్తున్నారని సమాచారం అందుతుంది! ఈ విషయాలపై జగన్ ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఫైనల్ గా వ్యక్తులు కాదు.. పార్టీ ముఖ్యం అని జగన్ ఇప్పటికే పలుమార్లు నేతలకు చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా… ఇటీవ‌ల చేనేత సామాజిక వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ హ‌నుమంత‌రావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు క‌మ‌ల‌తో జ‌గ‌న్ ప్రత్యేకంగా స‌మావేశ‌మైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారితో మంగ‌ళ‌గిరిలో తాజా పరిస్థితి.. పార్టీ గెలుపు.. అనుకూల, వ్యతిరేక అంశాలతోపాటు మొదలిన విషయాలపై చ‌ర్చించారు! ఈ సమయంలో… గంజి చిరంజీవి కంటే కాండ్రు క‌మ‌ల అభ్యర్థి అయితే గెలుపు మరింత సులువు అవుతుందనే క్లారిటీకి జగన్ వచ్చారని తెలుస్తుంది.

2009లో కాంగ్రెస్ త‌ర‌పున గెలిచి, నియోజకవర్గంలో మంచి పట్టున్న కాండ్రు క‌మ‌ల‌కు వైసీపీ టికెట్ ఇచ్చి 2024లో లోకేష్ పై పోటీకి దింపాలని జగన్ ఒక కన్ క్లూజన్ కి వచ్చారని తెలుస్తుంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్ ని ఓడిస్తే… ఇక చంద్రబాబు వార‌సుడి రాజ‌కీయానికి ముగింపు ప‌ల‌కొచ్చనేది జ‌గ‌న్ “వ్యూహం” అని చెబుతున్నారు.. అందుకు మంగళగిరి వైసీపీలో ప్రతీ కార్యకర్తా “సిద్ధం”గా ఉండాలని సూచిస్తున్నారు.