ఆయనంటే జగన్‌కి ఎంతో ఇష్టం.. కానీ తొక్కేయక తప్పడం లేదు 

YS Jagan no mercy on Amarnath Reddy
అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉనికిని వెతుక్కునే నాయకులు చాలా త్వరగానే  కనుమరుగైపోతారు.  అందుకే ఒకప్పుడు పార్టీ మారాలంటే నన విధాలుగా ఆలోచించేవారు లీడర్లు.  కానీ ఇప్పుడు అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రి కండువాలు మార్చేస్తున్నారు.  అందుకే కొన్నేళ్ళకే రాజకీయ తెర మీద వాళ్ళ పత్రాలు ముగిసిపోతున్నాయి.  అలా కనుమరుగైపోతున్న నేతల్లో  ఎన్.అమర్నాథ్ రెడ్డి కూడ ఒకరు.  చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఈయన ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.  అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే జగన్ చేతిలో నలిగిపోతున్నారు.  
 
YS Jagan no mercy on Amarnath Reddy
YS Jagan no mercy on Amarnath Reddy
2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పలమనేరు నుండి పోటీచేసిన ఆయన తెలుగుదేశం తరపున బలమైన అభ్యర్థిగా ఉన్న ఆర్వీ సుభాష్ చంద్రబోస్ మీద గెలుపొందారు.  చంద్రబాబు సొంత జిల్లాలో, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో అమర్నాథ్ రెడ్డి సాధించిన ఈ విజయాన్ని జగన్ విశేషంగా భావించారు.  కానీ అమర్నాథ్ రెడ్డే తేడాగా ఆలోచించారు.  చంద్రబబు వేసిన వలసల వలకు చిక్కి టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు.  ఆ చర్యే ఆయన రాజకీయ జీవితానికి ఆఖరు అయింది.  నమ్మి టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిచాడని జగన్ చాలా నొచ్చుకున్నారు.  
 
ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశ్యంతో కొత్త వ్యక్తి వెంకటె గౌడను బరిలో నిలిపి గెలుపు బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు.  చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో అయినా ప్రభావం చూపగల సత్తా పెద్దిరెడ్డికి ఉంది.  అందుకే గత ఎన్నికలో అమర్నాథ్ రెడ్డిని 32 వేల ఓట్ల తేడాతో మట్టి కురిపించారు.  కేవలం ఓడించడమే కాదు ఎన్నికల తర్వాత పలమనేరులో టీడీపీ మాట వినబడకుండా చేశారు.  ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ దాదాపు పడకేసినట్టే ఉంది.  ఎక్కడా ఆయన మాట వినబడట్లేదు.  అంతా వైసీపీ హవానే నడుస్తోంది.  ఎమెమ్మెల్యే వెంకటె గౌడకు పెద్దిరెడ్డి పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు.  ఈ తతంగం మొత్తాన్ని చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడ అమర్నాథ్ రెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని జగన్  భావించినట్టు తెలుస్తోంది. 
అలా ఒకప్పుడు జగన్ కు ప్రీతిపాత్రుడైన నేత ఇప్పుడు అదే జగన్ చేతిలో నలిగిపోతున్నారు.