బిగ్ హాట్ న్యూస్ జగన్ కి కొత్త రూట్ దొరికింది .. విశాఖ నుంచే పాలన..!

ఎలక్షన్ టైంలో ఉన్న కోపం, జోష్ మళ్లీ జగన్‌లో ఇప్పటికీ కనిపించాయి

మూడు రాజధానుల అంశం ఇప్పుడు రాష్ట్రంలో వైరల్ అవుతున్న విషయం. మూడు రాజధానుల అమలు కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి అమరావతి రైతులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో ఇస్తూ హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం మూడు రాజధానుల అంశాన్ని సీరియస్ గా తీసుకొని విశాఖపట్నం నుండి పరిపాలన చేయడానికి సిద్ధమవుతున్నారు. రాజధానిని విశాఖకు తరలించడానికి హై కోర్ట్ అడ్డు చెప్పింది. అయితే ఒక ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడి నుండైనా పరిపాలన చేయవచ్చు.

YS Jagan
YS Jagan

దానికి రాజ్యాంగంలో కూడా ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి నెలలో పది రోజులు విశాఖ నుండి తన పరిపాలన కొనసాగించడానికి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

విశాఖ లో ముఖ్యమంత్రి నెలలొ కొన్ని రోజులు విడిది చేస్తే చాలు, ఇక్కడ కూడా రాజధాని కళ వస్తుంది. ముఖ్యమంత్రి వెంట ఎటూ అధికార గణం వస్తుంది. ఆ సందడి కూడా ఎటూ ఉంటుంది. ఇక విశాఖ అభివ్రుధ్ధి విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కార్ ఎటూ ఆ దిశగా తన వంతుగా కార్యక్రమాలు చేస్తూ పోవచ్చు. మొత్తం మీద విశాఖ ఎప్పటికీ రాజధానే ధీమాతో తన పాలనను అక్కడి నుండి కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్ తన పాలనకు విశాఖ నుండి చేయడానికి ప్రయత్నిస్తున్నా కూడా హై కోర్ట్ మాత్రం అడుగడున ప్రభుత్వానికి మొట్టి కాయలు వేస్తుంది. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ, స్టేటస్ కో విధించినా కూడా ఈ నిర్మాణం ఎలా చేపడతారని చీఫ్ సెక్రటరీని ప్రశ్నించింది. విశాఖ నుండి ఎలాగైనా పరిపాలన చేయాలన్న జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.