YS Jagan: వైయస్ జగన్ ఇచ్చిన ఇంటి పట్టాలను వెనక్కి తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం.. మంత్రికి సంచలన వ్యాఖ్యలు

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాల అందించారు అలాంటి వాటిలో ఇల్లు పట్టాలు కూడా ఒకటని చెప్పాలి. ఇల్లు లేని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల పేరున ఇంటి పట్టాలను అందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఇంటి పట్టాల విషయంలో కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనర్హత కలిగిన వారు కూడా ఇంటి పట్టాలను అందుకున్నారని ఈయన తెలిపారు. ఇలా అనర్హత కలిగి ఇంటి పట్టాలు అందుకున్న వారి ఇంటి పట్టాలను వెనక్కి తీసుకుంటామంటూ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు.అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,654 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

33 రోజులపాటు అన్ని గ్రామాల్లో ఈ సదస్సులను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఆ తర్వాత 45 రోజుల కాల వ్యవధిలో ఫిర్యాదులు పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇంటి లబ్ధిదారుల జాబితాను వెల్లడించి అనర్హులను తేలుస్తామని, వారి నుంచి ఇంటి స్థలాన్ని వెనక్కి తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని తెలియజేశారు. కొత్త రేషన్‌ కార్డుల మంజూరుపైనా సదస్సుల్లో చర్చిస్తామని తెలిపారు.

ఇలా అనర్హులైన వారి నుంచి పట్టాలు వెనక్కి తీసుకుంటామని అర్హత కలిగిన వారికి ఇస్తామని చెప్పడంతో ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయామంలో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరికీ పార్టీలో కులమత భేదాలు లేకుండా ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇప్పుడు సర్కార్ మాత్రం ఇలా వెనక్కి తీసుకోవడం వల్ల ఎంతోమంది నష్టపోతారని ప్రజల వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.