వాళ్ళిద్దరి రహస్య భేటీ గురించే వైసీపీ తో పాటు టీడీపీ లో కూడా డిస్కషన్స్

tdp

రాష్ట్ర రాజకీయాలు వాడి వేడిగా నడుస్తున్నాయి.  ఆలయాల మీద దాడులు, మతం, దేవుడి పేరును అడ్డు పెట్టుకుని ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం బాగా ఎక్కువైంది.  చంద్రబబు నాయుడు ఎన్నడూ లేని విధంగా హిందూత్వ నినాదాన్ని భుజానికెత్తుకొని ప్రభుత్వం మీద విరుచుకుపడుతుంటే జగన్ ఏమో బాబు కూల్చిన ఆలయాలకు తిరిగి శంఖుస్థాపన అంటూ ముందుకొచ్చారు.  మధ్యలో బీజేపీ లాగూ ఉండనే ఉంది.  ఒకరి మీదే కాకుండా టీడీపీ, వైసీపీ రెండింటి మీదా కలిపి ఆరోపణలు గుప్పిస్తోంది.  ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారు తప్పు మీదంటే మీదని  కొట్టుకుంటుండటంతో ప్రజలకు ఎటువైపు నుండి ఆలోచించాలో  పాలుపోవట్లేదు.  

 

tdp
tdp

ఎంత డిఫెండ్ చేసుకుందామని చూసిన ప్రభుత్వానికి ఈ పరిస్థితి సంకటమనే  అనుకోవాలి.  అందరిలోనూ కాకపోయినా కొంతమందిలో అయినా ప్రభుత్వం పట్ల నెగెటివ్ అభిప్రాయం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.  ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.  ఈ భేటీ సుమారు మూడు గంటల పాటు సాగింది.  ఉన్నట్టుండి జగన్ ఇలా ప్రశాంత్ కిశోర్ ను నేరుగా ఇంటికే పిలిపించుకుని మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది.  ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు.  ఎలాంటి పొరపాట్లు లేకుండా వ్యూహాలను రచించి జగన్ ను ప్రజలకు చేరువ చేశారు. 

అందుకే ఆయన్ను పిలిపించుకుని ఈ విపత్కర పరిస్థితి నుండి ఎలా బయటపడాలి, ప్త్రత్యర్థుల నోటికి ఎలా తాళం వేయాలి అనే విషయాలను జగన్ చర్చించారని చెప్పుకుంటున్నారు.  ఎన్నికల కమీషనర్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల నోటిఫికేషన్ కూడ వదిలారు.  ఇవి రెండూ జగన్ మీద గట్టిగానే ప్రభావం చూపుతాయి.  అందుకే ఆయన పీకేను పిలిపించుకుని మీటింగ్ పెట్టి ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎన్నికల్లోకి దిగాల్సి వస్తే ఎలాంటి వ్యూహాలను అమలుచేయాలి అనే విషయాల మీద చర్చలు జరిపి ఉంటారని, పీకే వచ్చారు కాబట్టి ప్రత్యర్థుల పప్పులు ఇక ఉడకవని వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తుంటే, టీడీపీ మాత్రం పీకే, జగన్ మధ్యన ఎలాంటి డిస్కషన్ జరిగింది, వారి ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలి అనే కంగారులో ఉన్నారు.  మొత్తానికి పీకేతో జగన్ మీటింగ్ అందరిలోనూ హాట్ టాపిక్ అయింది.