టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుందా? టీడీపీ పై వచ్చిన వ్యతిరేకతే ఇప్పుడు వైసీపీపైనా వస్తుందా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారన్నది చాలా మంది నమ్మకం. కానీ 151 సీట్లతో భారీ మెజార్టీ గెలుస్తారని ఆయన కూడా ఊహించలేదు. కానీ జరిగింది. ఇదంతా ఆయన పడిన కష్టానికి ఫలితం కావొచ్చు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన పునాదులు కావొచ్చు. కారణం ఏదైనా జగన్ మోహన్ రెడ్డి గెలుపు ఏపీ రాజకీయాలలో ఓ చారిత్రాత్మక ఘట్టం. అయితే గత ప్రభుత్వం టీడీపీ లో చోటుచేసుకున్నట్లే ఎక్కడికక్కడ వైసీపీ లోనూ నాయకుల మధ్య విబేధాలు పెరిగిపోతుడటం..మంత్రులు..ఎమ్మెల్యేలు.. అవినీతి వ్యవహారాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో కొందర్ని అదుపులో పెట్టే ప్రయత్నాన్ని జగన్ మోహన్ రెడ్డి చేసారు. టీడీపీ ప్రభుత్వంలోనూ ఇలాగే జరిగింది. దీంతో ఆ ప్రభుత్వంపై అప్పట్లో బాగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాలకు టీడీపీ దూరమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు వైసీపీ కూడా ఉందని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ లు….పార్టీలో అసంతృప్తి తో ఉన్న నేతలు.. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన నేతల మధ్య సఖ్యత సరిగ్గా కుదరడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ..నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని కథనాలు వెలువడుతున్నాయి.
పార్టీలో నేతలు రెండు..మూడు గ్రూపులుగా ఏర్పడి గ్రూప్ రాజకీయీలకు..ఆధిపత్య పోరుకు తెర తీస్తున్నట్లు సమాచారం. ఇది ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితులు..అయితే ఇలాంటి వాటిని ముందే ఊహించే జగన్ మోహన్ రెడ్డి వాటిని చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగానే కొంత మంది నేతల్ని గతంలోనే పిలిపించి మాట్లాడటం…అవసరం మేర కాస్త గట్టిగానే సముదాయించడం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలాంటి వ్యవహారాలు ఏ రాజకీయ పార్టీకి మంచివి కాదు. ఇప్పటికే వైసీపీ పై ప్రభుత్వంపై ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకొచ్చే దిశగా పావులు కదుపుతోంది. రాష్ర్టంలో చోటు చేసుకుంటోన్న పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలుచుకుని తెలివిగా రాజకీయం చేస్తున్నాయంటూ అధికార పక్షం నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.