నిజంగానే, ఇది షాకింగ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఎడ్యుకేషన్ సమ్మిట్ పేరుతో ‘కాన్‌క్లేవ్’ని ఇండియా టుడే సంస్థ ఆధ్వర్యంలో ఏపీ సర్కారు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగున్నర కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఈ కార్యక్రమానికి వెచ్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి ప్రచారం చేసుకోవడానికి, ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ కాన్‌క్లేవ్‌ని వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ జర్నలిస్ట్‌తో మాట్లాడుతూ, ‘ఈ క్షణం నేను ఓడిపోయి, గద్దె దిగాల్సి వచ్చినా నేనేమీ బాధపడను..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఏ కాంటెక్స్‌ట్‌లో ఈ మాటల్ని జగన్ అన్నారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇలాంటి మాటలు, కార్యకర్తల్లో నిస్తేజాన్ని నింపుతాయి. పార్టీ ముఖ్య నేతల్లో పార్టీ పట్ల అపనమ్మకాన్ని పెంచుతాయి.
ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ప్రజా ప్రతినిథులు, వేరే పార్టీల్లోకి దూకేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ జగన్, ఓటమి గురించి మాట్లాడటమేంటి.? ఓడినా బాధపడనని చెప్పడమేంటి.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీయార్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఫలితం ఏమయ్యిందో చూశాం. అదే ఫలితం ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురవుతుందా.? అంతేనేమో.!