YS Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన చంద్రబాబు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీడీపీ బ్యాచ్ ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసే సోషల్ మీడియా వేదికగా ఎన్నో కుట్రాలకు పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నా తల్లి చెల్లెల పేర్లతో రాజకీయం చేస్తున్నారని ఇది ఏ మాత్రం మంచిది కాదని జగన్ తెలిపారు.
చంద్రబాబు నాయుడు నీకు కూడా ఓ కుటుంబం ఉంది కదా ఆ విషయం మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. ఐటీడీపీ బ్యాచ్ ఫేక్ అకౌంట్లో క్రియేట్ చేసి టిడిపిని మేము తిడుతున్నట్టు చిత్రీకరించారని తెలిపారు.షర్మిలపై బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించలేదా అని జగన్ ప్రశ్నించడమే కాకుండా ఐటీడీపీ బ్యాచ్ తో తన కుటుంబాన్ని అలాగే నా పట్ల నా చెల్లి పట్ల తల్లి విషయంలో కూడా అనుచితంగా అసభ్యకరంగా పోస్టులు చేయించావు.
ఉదయ్ భూషణ్ అనే ఐటీడీపీ కార్యకర్తతో తన కుటుంబాన్ని తిట్టించారని తెలిపారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించారని.. ఆర్జీవీపై తప్పుడు కేసులు పెట్టారని జగన్ మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ సెన్సార్ బోర్డు అనుమతితోనే సినిమా చేశారు ఆయనకు సెన్సార్ అనుమతి తెలిపింది. మీ టిడిపి బ్యాచ్ చేస్తున్నవే సినిమాల అంటూ జగన్ ప్రశ్నించారు.
నీకు కుటుంబం ఉంది కదా.. మీ తల్లిదండ్రులను ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకు చూపించారా అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. ఎప్పుడైనా వారిని ఇంటికి పిలిచి రెండు పూటలా భోజనం పెట్టావా కనీసం వారు చనిపోతే తలకొరివి పెట్టడానికైనా నువ్వు వెళ్ళావా అంటూ చంద్రబాబు నాయుడు పట్ల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.