YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందులలో తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈయన నిన్న విజయవాడ నుంచి పులివెందులకు చేరుకొని అక్కడ వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలను నిర్వహించారు. అలాగే ముందస్తు క్రిస్మస్ వేడుకలలో కూడా ఈయన పాల్గొని సందడి చేశారు. ఇక నేడు పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి జగన్ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారని తెలుస్తోంది.
ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిగినటువంటి ఒక ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటోలు తన చెల్లి షర్మిల ఫ్యామిలీ తప్ప మిగిలిన అందరూ కూడా కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోలో వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇక ఈ క్రిస్మస్ వేడుకలలో జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి కనిపించారు.
నిన్న వైయస్సార్ ఘాట్ వద్ద కూడా విజయమ్మ తన కొడుకును ఎంతో ఆప్యాయంగా హక్కును చేర్చుకొని తన ఆశీర్వాదాలను అందజేశారు ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలను కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో తల్లి కొడుకులు మధ్య ఉన్న భేదాభిప్రాయాలు తొలగిపోయాయని స్పష్టమవుతుంది. ఇలా ఇన్ని రోజులపాటు విజయమ్మ తన కూతురు షర్మిల వద్ద ఉండడంతో వైఎస్ జగన్ తన తల్లిని కూడా బయటకు దొబ్బేసారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేశారు కానీ వీరి మధ్య అలాంటి భేదాభిప్రాయాలు ఏవి లేవని స్పష్టం అవుతుంది.
ఇకపోతే ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి కూటమి ప్రభుత్వ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా వైయస్ విజయమ్మ స్పందిస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తే కనుక తాను పరువు నష్టం దావా వేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ విజయమ్మ జగన్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం అవుతుంది.