(లక్ష్మణ్ విజయ్ కొలనుపాక)
విజయవాడను గుప్పిట్లో పెట్టుకుంటే రాజధాని అమరావతి కంట్రోల్ లోకి వస్తుందని ఆశపడి, ఏవో కూడికలు తీసివేతలు వేసుకుని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ రాజకీయాల్లో ఇరక్కుపోయాడు. కృష్ణా జిల్లా ఆయనక తలబొప్పికట్టిస్తున్నది.ఇటీవలి కాలంలో ఇది ఆయనతగిలిన రెండో దెబ్బ. మొదటి దెబ్బ కాపు రిజర్వేషన్ల మీద ఆయన తీసుకున్న యు టర్న్. ఇపుడు దీనికి ఎక్స్ టెన్షనే విజయవాడ చిక్కుముడి. విజయవాడ సెంట్రల్లో వచ్చిన తిరుగుబాటును ఆయన వూహించి వుండరు. వంగవీటి రాధా నుంచి ఇంత తీవ్రంగా ఎదరుదాటి ఉంటుందని జగన్ వూహించి ఉండడు.
దీనికి రాష్ట్ర మొత్తంగా జగన్ అనుసరిస్తున్న విధానమే కారణం అంటున్నారు. ఎందుకంటే, నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను నియమించడం,వాళ్లనే అభ్యర్థులనడం, తర్వాత ఇన్ చార్జ్ లను మార్చడం, అంతకు ముంద టికెట్ ఇస్తానని ఆశ కల్పించిన వ్యక్తి తీసేని మరొక వ్యక్తికి టికెట్ ప్రకటించడం…వైసిపి గందరగోళోం నిండిపోయింది. సర్వేలన్నీ వైసిపికె పట్టం అని చూపిస్తున్నపుడు, జగన్ పాదయాత్రకు లక్షల్లో జనం వస్తున్నపుడు అభ్యర్థులను సర్వేల పేరుతో , ప్రజాభిప్రాయంతో మార్చడం దేనికి. వాళ్ల చేయించుకునే సర్వే ఫలితాల మీద వాళ్లకే నమ్మకం లేదా? లేదనే అనిపిస్తుంది.
ఉదాహరణకు కృష్ణా జిల్లా తీసుకుందాం. ఈజిల్లాలో చేసిన నియోజకవర్గ ఇన్ చార్జ్ల మార్పు పార్టీకి పెద్ద ఛాలెంజ్ గా తయారయింది. పార్టీ అసంతృప్తి వర్గాన్ని తయారు చేసింది. కొత్త తలనొప్పి తీసుకువచ్చింది. దీని పర్యవసానం ఎలా ఉంటుందోననే అందోళన స్థానిక నాయకుల్లో మొదలయింది. విజయవాడు సెంట్రల్ ఈ తలనోప్పికి ఎపిసెంటరయింది. దాని ప్రకంపనలు విజయవాడ ఈస్ట్, వెస్ట్‌కి కూడా తాకాయి. విజయవాడ సెంట్రల్ బాధ్యతల్ని ఆ మధ్య కాంగ్రెస్ నుంచి వైసిపిలోకి వచ్చిన మల్లాది విష్ణుకి అప్పగించడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ సీటు మీద ఆశపెట్టుకుని ఉన్న వంగవీటి రాధా అనుచరులు దీనితో భగ్గు మన్నారు. ఎంత హంగామా చేశారో చూశారు కదా. పెట్రోలు పోసుకుని అంటపెట్టుకునే స్థాయికి వెళ్లింది వ్యవహారం.ఇంత జరిగాక, వంగవీటికి
విజయవాడ ఈస్ట్ టికెట్ ఇస్తామని చెబుతున్నారు. దీనితో టిడిపి నుంచి వైసిపిలో చేరిన యలమంచిలి రవి గుండెలు జారాయి. ఆయన ఈస్టుమీది ఆశతోనే పార్టీ మారారు. ఇపుడు వంగవీటికి ఈస్టు కేటాయిస్తే తన పరిస్థితేమిటి. ఆయన అనుచరులు కూడా పెట్రోలు పోసుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం ఈస్టు నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉంటున్నారు యలమంచిలి రవి.వైసిపి నిర్ణయంతో ఆయన అనుచరుల్లో కలకలం మొదలయినట్లు సమాచారం.
ఇక విజయవాడ వెస్ట్‌లో కూడా మంటలు లేస్తున్నాయి. అక్కడ నాయకత్వం మార్పు అవసరమని పార్టీ భావిస్తున్నది. నియోజకవర్గం ఇన్ చార్జ్ గా వెల్లంపల్లిని తప్పించి పోతిన ప్రసాద్‌ను నియమించబోతున్నారనేదే ఇ పుడు టాక్ అఫ్ ది టవున్ అంటే నమ్మండి. విజయవాడ గందరగోళమే జిల్లాలోని మరో రెండు మూడు నియోజకవర్గాల్లో కూడా మొదలయింది. ఉదాహరణకు పెడనలో మొన్నటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఉప్పాల రామ్‌ప్రసాద్‌ను తప్పించి జోగి రమేష్‌కి అప్పగించిన విషయం తెలుసు కదా.
అలాగే అవనిగడ్డలో మార్పు చేయాలనుకుంటున్నారు. అక్కడినియోజకవర్గం ఇన్‍ఛార్జ్ సింహాద్రి రమేష్‌ను తప్పించి జగన్ కు సన్నిహితుడయిన బాలాశౌరి అక్కడ పీఠం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఈ మార్పు విషయం బయటకు పొక్కిందో లేదో అసంతృప్తి సెగులు మొదలయ్యాయి. ఈ పార్టీ నాయకత్వం వేస్తున్న ఈ ఎత్తులు పైఎత్తులు చివరకు ఏ ప్రమాదం తీసుకొస్తాయో ననే ఆందోళన పార్టీ వర్గాల్లో మొదలయింది. కృష్ణా జిల్లాలో మంటాలర్పేందుకు సీనియర్ నాయకులందరిని రంగంలోకి దించారట జగన్.