మన దేశంలో రాజకీయాల గురించి మాట్లాడితే నేరాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట ఉన్న నేరస్థుల కంటే కూడా రాజకీయాల్లోనే నేరస్థులు ఎక్కువగా ఉన్నారు. ఆ నేరస్తులే మనలను పాలిస్తున్నారు, వాళ్ళు చేసిన చట్టాలనే మనం పాటించాల్సి వస్తుంది. దాదాపు దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరు ఇదొక కేసులో బుక్ అయినవారే. చాలామంది నేతలు బెయిల్ లపైనే బయట ఉంటున్నారు. రాజకీయాలు ఎంతగా మారిపోయాయంటే మోసం చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని ఉపయోగించేంతగా మారిపోయాయి. అయితే ఇప్పుడు ఈ నేతల పని పట్టడానికి సుప్రీం కోర్ట్ ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఇలా నేరాలు చేస్తూ రాజకీయాల్లో ఉన్న నేతలపై అమికస్ క్యూరీ ఏర్పాటు కాగా, కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. కేంద్రం సైతం ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. త్వరలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిథులు, మాజీ ప్రజాప్రతినిథులపై తీవ్రమైన నేరాభియోగాలపై వీలైనంత త్వరగా విచారణ పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదే గనుక జరిగితే, చాలామంది ప్రజా ప్రతినిథుల పదవులు ఊడిపోయే అవకాశముంది. దీనికి కేంద్రం ఒప్పుకొని అమలులోకి వచ్చినా కూడా నాయకుల తమ జిత్తులమారి తెలివిని చూపించి తప్పించుకోగలరు. ఒకవేళ ఇది అమలులోకి వస్తే ఒక్క సంవత్సరంలో కేసుల్లో ఇరుక్కున్న రాజకీయ నేతలపై విచారణ పూర్తి కానుంది.
తాజగా సుప్రీం తీసుకున్న నిర్ణయం వల్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలపై కూడా కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. వీళ్ళతో పాటు దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నేతలు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. నేరాలకు పాల్పడిన రాజకీయ నేతలకు శిక్షలు పడే ఏ చట్టానికైనా మనమందరం ఒప్పుకోవాలి.