బెయిల్ ఎవరిస్తారు.? న్యాయస్థానం ఇస్తుంది.! వ్యక్తులు ఇచ్చే బెయిల్ కాదు.! న్యాయస్థానంలో వాదోపవాదాలు జరుగుతాయి.. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పునిస్తారు. ఆ తీర్పు అంత ఆషామాషీగా రాదు.
సరే, ఈ రోజుల్లో న్యాయ స్థానాల తీర్పులపై పౌర సమాజంలో జరుగుతున్న చర్చ ఏంటి.?న్యాయమూర్తుల పట్ల పౌర సమాజంలో వున్న అభిప్రాయాలేంటి.? అన్నది మళ్ళీ వేే వ్యవహారం.!
వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చిందనగానే, ‘లాబీయింగ్ ఫలించింది.. బెయిల్ వచ్చింది..’ అంటూ టీడీపీ అను‘కుల’ మీడియా రచ్చ మొదలు పెట్టింది. వచ్చింది ముందస్తు బెయిల్ మాత్రమే. వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కాలేదు. వచ్చిన బెయిల్ కూడా, మధ్యంతరమే.
ఈ నెల 25 వరకు అరెస్టు చేయొద్దని మాత్రమే న్యాయస్థానం పేర్కొంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేప్పొద్దున్న సీబీఐ, మళ్ళీ న్యాయస్థానంలో ఈ ముందస్తు బెయిల్‌ని సవాల్ చేస్తే, ఆ కథ వేరే వుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకులు చాలా కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ లాబీయింగ్ అవసరమవుతోందా.? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లాబీయింగ్ ద్వారా బెయిల్ వస్తే, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికీ బెయిల్ రావాలి కదా.?