అవినాష్ రెడ్డి… సీబీఐ విచారణ, బెయిల్ పిటిషన్ అప్ డేట్స్ ఇవే!

ప్రస్తుతం ఏపీరాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సీబీఐ విచారణకు పిలిచింది. అయితే విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్ చేరుకున్న అవినాష్ రెడ్డి.. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేసమయంలో… విచారణ విషయంలో మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది.

అవును… మంగళవారం ఉదయం 10:30 గంటలకెళ్లా మరోసారి విచారణ నిమిత్తం ఆఫీస్ కి రావాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ. అయితే… ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి పిటిషన్ వేసిన కారణంగానే… ఆయన విచారణను సీబీఐ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా… అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని సీబీఐ కోర్టుకి తెలిపడం సంచలనం మారింది! అయితే… కోర్టు విచారణ రేపు మధ్యాహ్నం ప్రారంభమవుతున్నందున.. మీ విచారణను సాయంత్రం 4 గంటల తర్వాత చేపట్టాలని హైకోర్టు సీబీఐకి సూచించింది.

మరోవైపు బెయిల్ పిటిషన్ లో వైఎస్ వివేకాపై అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో సీబీఐ విచారణకు హాజరైన సందర్భంలో వివేకా రెండో పెళ్లి గురించి మీడియాకు చెప్పిన అవినాష్ రెడ్డి… ఈసారి మరో అడుగు ముందుకేసినట్లు తెలుస్తుంది. తాజాగా వివేకాకు మరో ఇద్దరు మహిళలతో సంబంధాలున్నట్టు బెయిల్ పిటిషన్లో అవినాష్ పేర్కొన్నట్టు వార్తలొస్తున్నాయి. నిందితులతో కలసి వివేకా గతంలో డైమండ్స్ వ్యాపారం కూడా చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా…అవినాష్ రెడ్డి – సీబీఐ విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం నుంచీ నెలకొన్న ఉత్కంఠ మంగళవారానికి వాయిదా పడింది!