జగన్‌తో సంచలన విషయం చెప్పిన యువతి

విశాఖ ఎయిర్ పోర్టులో దాడి తర్వాత తిరిగి సోమవారం నుంచి జగన్ తన పాదయాత్రను మొదలు పెట్టారు. విజయనగరంలో పాదయాత్ర చేస్తున్న జగన్ పార్వతీపురం చేరుకోగానే ఓ యువతి జగన్ ను కలిసి తాము టిడిపి నేతల ద్వారా ఎదుర్కొన్న సమస్యలన్నింటిని చెప్పింది. ఆమె మాటలు విని జగన్…ఇంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆ యువతి ఏం చెప్పిందంటే..

పార్వతీపురం పరిధిలోని ఎంఆర్ నగర్ కి చెందిన రొంపిల్లి లక్ష్మీ జగన్ ను పాదయాత్రలో కలిశారు. అన్నా… తాము వైసిపి అభిమానులమని టిడిపి నాయకులు కక్ష్య కట్టి వేధిస్తున్నారు. తన తండ్రి రొంపిల్లి తిరుపతి రావు ఎంఆర్ నగర్ మాజీ సర్పంచ్.. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏవేవో సాకులు చెప్పి చెక్ పవర్ రద్దు చేయించారు. నా తండ్రి మీద కక్ష్యతో 58 మంది పింఛన్లను కూడా నిలిపేశారు. దీని పై కోర్టుకెళితే 36 మందికి తిరిగి పింఛన్లు ఇచ్చారని లక్ష్మీ జగన్ కు తెలిపింది.

రొంపిలి లక్ష్మీ

సర్పంచ్ గా ఉన్నంత కాలం కూడా టిడిపి నాయకులు వేధించారని, దీంతో తన నాన్న మానసికంగా చాలా బాధపడ్డాడని తెలిపింది. పేరుకే సర్పంచ్ గా ఉండే వాడని అధికారం అంతా వారే చలాయించేవారని తెలిపింది. అధికారులు కూడా టిడిపి నాయకులు ఏ విధంగా చెబితే ఆ విధంగా వినేవారని తెలిపింది. వైసిపి నాయకులను చాలా ఇబ్బందులకు గురి చేశారని లక్ష్మీ జగన్ కు చెప్పింది.

లక్ష్మీ చెబుతున్నంత సేపు శ్రద్దగా విన్న జగన్ లక్ష్మీని ముందుగా అభినందించారు. చిన్న వయస్పైనా కూడా ఏ మాత్రం బెదరకుండా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రజల కోసం ఆలోచిస్తున్నావన్నారు. తండ్రి ఇబ్బందులు పడుతుంటే రాజకీయాలు మానేసి మన దారి మనం చూసుకుందాం అని చెప్పే ఈ రోజుల్లో తండ్రికి అండగా నిలబడి కోర్టుకు వెళ్లి పేదవారికి పింఛన్లు ఇప్పించినందుకు జగన్ లక్ష్మీని అభినందించారు. టిడిపి నాయకులు చేస్తున్న అరాచకాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. లక్ష్మీ లాంటి చెల్లెల్లు ఇంటికొకరు ఉంటే చాలని జగన్ అన్నారు.

 టిడిపి నాయకుల వేధింపులు మనల్ని ఏం చేయలేమని ప్రజా సేవ చేస్తుంటే ఓర్వని వారు అలానే చేస్తారని జగన్ అన్నారు. మీ కుటుంబానికి వైసిపి అండగా ఉంటుందని నీవు బాధ పడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. నీ లాంటి వాళ్లు రాజకీయాలలోకి రావాలని జగన్ లక్ష్మీని ప్రోత్సహించారు.