పథకాల అమలు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీడ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏపీలో దాదాపు అన్ని కులాలకి పథకాల విషయంలో సమన్యాయం చేస్తున్నారు. మెనిఫెస్ట్ లో లేని ఎన్నో కొత్త పథకాల్ని..అంశాల్ని తెరపైకి తీసుకొచ్చి వాటిని అమలు చేసారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు..ఇవ్వని హామీలను సైతం జగన్ సర్కార్ అమలు చేస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకున్నారు. తాజాగా ఇదే పథకం ద్వారా మరో నాలుగు కులాలకు ప్రయోజనం కల్పించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
బుడుగు జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతో, ఒరియా కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండానే వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ నాలుగు కులాల మహిళకు కూడా లబ్ధి పొందాలని నిర్ణయించారు. అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వైఎస్సార్ చేయూత పథకానికి నోచుకోలేకపోయిన నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య గల మహిళకు నాలుగు విడతల్లో 75 వేల రూపాయలు అకౌంట్ లో జమ అవుతున్న సంగతి తెలిసిందే. జగన్ తాజా నిర్ణయంతో ఆ నాలుగు కులాల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ లాంటి కష్టకాలంలోనే జగన్ మోహన్ రెడ్డి పథకాలు అమలు విషయంలో ఎంత మాత్రం వెనక్కి తగ్గలేదని..పాలనలో తన మార్క్ వేస్తూ దూసుకుపోతున్నారని మహిళా మణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మెనిఫెస్టో లో చెప్పిన పథకాలు దాదాపు 80 శాతం పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసింది. పాలనలో ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడిన సంగతి తెలిసిందే.