తప్పదు నిమ్మగడ్డ సారూ …. మీరు సుప్రీం కోర్టు మెట్లు ఎక్కాల్సిందే ?

తొలివిడత పంచాయతీ ఎన్నికల నిర్వహణతీరుపై, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, రెవెన్యూఅధికారులు, ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణలో వ్యవహరించినతీరుపై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందని, ఆపార్టీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అసహనం వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ సరైనరీతిలో ఎన్నికలు నిర్వహించలేదనే అభిప్రాయంతో తామున్నామని, ప్రభుత్వంలోనివారు, అధికారపార్టీకి చెందిన ముఖ్యనాయకులు, ముఖ్యమంత్రి సహా అందరూ ఎన్నికలకమిషనర్ ని కార్నర్ చేసి, ఆయన్ని కులపరంగా, వ్యక్తిత్వంపరంగా, దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని అన్నారు.

ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్ని కల కమిషనర్ ఏంచర్యలు తీసుకున్నారని, హైకోర్టు తీర్పుపై ఎస్ఈ సీ ఎందుకు అప్పీలు చేయలేదని, అలాచేయకపోవడంలో ఎస్ఈసీ మెతకతనం ఉన్నట్లుగా తమకు అర్థమైందని రామయ్య స్పష్టంచే శారు. ఎస్ఈసీకి సహకరించిన అధికారులను బ్లాక్ లిస్ట్ లో పెడతా నని మంత్రి బహిరంగంగా బెదిరిస్తే, అతనిపై ఐపీసీ 506 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. తొలుత ఏకగ్రీవాలను ప్రకటించవద్దన్న ఎస్ఈసీ, తరువాత ఏకపక్షంగా ఏకగ్రీవాలను ప్రకటిచండానికి ఎలా ఒప్పుకున్నారన్నారు. ఎస్ఈసీ గవర్నర్ ను కలిసి వచ్చినతర్వాతే ఏకగ్రీవాలను ప్రకటించాలని ఆదేశించడం జరిగిందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీస్ యంత్రాంగం, అధికారులుఉన్నారా అనే సందేహం కలుగుతోందన్న రామయ్య, అక్కడ 77స్థానాల్లో ఎన్నికలు జరిగితే, 76ఏకగ్రీవాలయ్యాయని, ఇండియాలో 29రాష్ట్రాల్లో ఎక్కడా ఈవిచిత్రం ఉండదన్నారు.

నాకు ఓటేయకపోతే, నాపార్టీ అభ్యర్థులను గెలిపించకపోతే, మీకు పథకాలురావని ఎమ్మెల్యే జోగిరమేశ్ అంటే, అతనికి తూతూ మంత్రంగా నోటీసులిచ్చిన ఎన్నికలకమిషన్ రేపట్నుంచీ ఇలా మాట్లాడొద్దని చెప్పడమేంటన్నారు. పబ్లిక్ మీటింగ్ లో ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తమకు ఓటేయకపోతే, ప్రభుత్వపరంగా వచ్చే రాయితీలు రావంటే, అతను వచ్చే ఎన్నికల్లో పోటీచేయకుం డా చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికలకమిషన్, నోటీసులిచ్చి ఊరుకో వడమేంటని రామయ్య అడిగారు. మంత్రి కొడాలినానీకి నోటీసులు ఇవ్వడం ముఖ్యంకాదని, చర్యలు తీసుకోవాలని విలేకర్లు అడిగినప్రశ్నకు సమాధానంగా రామయ్య అభిప్రాయపడ్డారు. మంత్రి కొడాలినానీ అసలు మనిషే కాడని, మనిషిరూపంలో ఉన్నచెత్తని, డంపింగ్ యార్డ్ అని, అటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమన్నారు. 11కేసుల్లో ముద్దాయిగా ఉన్నా, రాష్ట్రాన్ని కొల్లగొట్టినా, తాను జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడూ గౌరవంగానే సంబోధిస్తానన్నారు. గుడివాడ ఓటర్లంతా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకొని, కొడాలి నానీని మనిషిగా మార్చి, అతనిలో మానవత్వం నింపడానికి ప్రయత్నిస్తే మంచిదని రామయ్య హితవుపలికారు.