ఔను, చంద్రబాబు చెప్పిందే రైటు.! ఓటర్లదే తప్పు.!

2018 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెబితే, ఓటర్లను నమ్మారు.. 2014 ఎన్నికల్లో అధికారం ఇచ్చారు. ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు చెప్పారు.. ఓటర్లు నమ్మారు. రాజధాని అమరావతిని విశ్వనగరంగా నిర్మించేస్తామని చంద్రబాబు చెబితే, జనం నమ్మారు.!

ఒకటా.? రెండా.? చెప్పుకుంటూ పోతే చాలానే.! మరి, 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు తన హయాంలో ఏం చేసినట్లు.? పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యిందా.? జిల్లాకో విమానాశ్రంయ వచ్చిందా.? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా.? చంద్రబాబు ఏం చేయగలిగినట్లు.? నమ్మి మోసపోవడం ఓటర్లకు అలవాటే. ప్రతిసారీ ఓటర్లు తప్పు చేస్తూనే వుంటారు. రాజకీయ నాయకుల్ని నమ్మడమే ఓటర్లు చేసే పెద్ద తప్పు. చంద్రబాబు వ్యాపారాలు వృద్ధి చెందాయ్. మరి, రాష్ట్ర ప్రజల సంపద పెరిగిందా.? అంటే అదీ లేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా అంతే, ఇంకొకరైనా అంతే.. అన్న భావనకు ఓటర్లు వచ్చేస్తున్నారంటే కారణం రాజకీయాలు అలా మారిపోయాయ్.!

ఓటర్ల దగ్గరకు వెళ్ళి మాట్లాడిటేప్పుడ, రాజకీయ నాయకులు కొంత సంయమనం పాటించాలి. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. అంటే ఓటర్లను తిట్టడమేనని చంద్రబాబు అనుకుంటున్నట్టున్నారు. ‘ఇదే చివరాఖరి అవకాశం.. మీరు నాకు ఓటెయ్యకపోతే మీ ఖర్మ..’ అంటున్నారు చంద్రబాబు. మొన్నటికి మొన్న స్థానిక ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు ఇలాగే మాట్లాడారు. ఇప్పుడూ అదే తీరు. ఏం, 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే.. హెరిటేజ్ ఆస్తుల్ని రాష్ట్ర ప్రజల కోసం వినియోగిస్తారా.? లేదు కదా.? ఈమాత్రందానికి ఓటర్లను నిందించడమెందుకు.? అడ్డగోలు వ్యాఖ్యలెందుకు.?