పవన్ పై పసుపు ఫైట్ స్టార్ట్… మీకు అర్ధమవుతోందా?

అంతా ఊహించినట్లే జరుగుతోంది! పవన్ పై ఎల్లో మీడియాగా ముద్రపడిన కొన్ని ఛానళ్లు అప్పుడే దాడులు మొదలుపెట్టేశాయి. ఎప్పుడైతే బీజేపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తూ.. టీడీపీకి దూరమవుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయో.. పవన్ ని టార్గెట్ చేసేశాయి! ఈ విషయం పవన్ జనం గ్రహించారో లేదో కానీ… మేటర్ మాత్రం స్పష్టంగా ఉంది!

అవును… ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో పొత్తుల రాజకీయం సరికొత్త మలుపు తిరిగిందని అంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి టీడీపీకి ఆహ్వానం అందకపోవడంతో… జనసేనకూ టీడీపీకి బంధం కుదిరేలా లేదనే కామెంట్లు మొదలైపోయాయి.

ఈ సమయంలో ప్రతీ మాటలోనూ సంచలనం కోసం పరితపిస్తుంటారనే పేరు సంపాదించుకున్న పవన్… ఒక అడుగు ముందుకేసి.. ఏపీలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే అనేశారు. జనసేనకున్న ఓట్ల శాతం ఎంత, బీజేపీకున్న ఓట్ల శాతం ఎంత అనేది తెలిసి అన్నారో.. తెలియక అన్నారో తెలియదు కానీ… టీడీపీ రహిత ప్రభుత్వం అనే సంకేతాలు ఇచ్చారు.

దీంతో పసుపు మీడియా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా పసుపురంగులో మునిగితేలే పేరు సంపాదించుకున్న ఒక ఛానళ్ డిబేట్ లో పవన్ విశ్వసనీయతను ప్రశ్నించడం మొదలుపెట్టారు. పవన్‌ కు అసలు ఏమాత్రం క్రెడిబులిటి లేదని తేల్చేశారు. నాలుగేళ్ళుగా బీజేపీకి పవన్ మిత్రపక్షంగా ఉన్నాడన్న విషయాన్ని మరిచారు.

అవును… నాలుగేళ్ళుగా బీజేపీకి పవన్ మిత్రపక్షంగా ఉన్నప్పుడు లేని అభ్యంతరం సడెన్‌ గా ఇప్పుడే మొదలైంది. కారణం… చంద్రబాబుతో కాకుండా, పవన్ బీజేపీతో మాత్రమే ఎన్నికలకు వెళతారనే సమాచారం ఉందో ఏమో మరి! దీంతో ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీతో పవన్ అంటకాగటం ఏమిటంటూ విశ్లేషకుడు మండిపోయారు.

విషయం ఏమిటంటే… పవన్ నాలుగుళ్ళుగా బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నారన్న విషయం సదరు విశ్లేషకుడికి తెలియంది కాదు. పవన్‌ కి క్రెడిబులిటి లేదని తెలిసినా మరింతకాలం ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకంటే టీడీపీ + జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తాయని అనుకున్నారు. అందుకనే పవన్‌ లోని లోపాలను, క్రెడిబులిటిని ఎల్లో మీడియా ప్రశ్నించలేదు.

ఆఖరికి వాలంటీర్లకు నీచంగా మాట్లాడినా కూడా స్పందించలేదు. పైగా… పవన్ కల్యాణ్ ను వెనకేసుకొస్తూ డిబేట్లు కొనసాగించారు. అయితే తాజాగా జరిగిన ఎన్ డీయే సమావేశంతో చందర్బాబుకు, ఆయన అనుకూల మీడియాకూ ఒక క్లారిటీ వచ్చినట్లుంది. ఫలితంగా.. పవన్ క్రెడిబిలిటీపై ఇప్పుడు ప్రశ్నలు సందించడం మొదలుపెట్టింది.