జగన్ పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా.. వైసీపీకి మరింత లాభమా?

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉంటే ఒక విధంగా మరో పార్టీ అధికారంలో ఉంటే మరో విధంగా రాతలు రాయడం ఎల్లో మీడియాకు అలవాటే అనే సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి కొంతమంది విమర్శలు చేసినా ఎల్లో మీడియా మాత్రం అణువంతైనా మారలేదు. జగన్ పై బురద జల్లే ఏ అవకాశాన్ని ఎల్లో మీడియా వదులుకోవడం లేదు. ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తుండటం గమనార్హం. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ప్రజలు సైతం ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని సగం మంది ప్రజలకు ఈ కార్యక్రమం జరుగుతుందనే సమాచారం కూడా లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగానే అర్థమవుతుంది.

ఎల్లో మీడియా ప్రచారం వల్ల గత ఎన్నికల సమయంలో టీడీపీ ఊహించని స్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. ఎల్లో మీడియా వైసీపీపై ఏ స్థాయిలో విమర్శలు చేసినా ఆ విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితులు పోయాయి. చంద్రబాబు గొప్ప పాలకుడిలా ఎల్లో మీడియాకు తప్ప మరెవరికీ కనిపించరనే సంగతి తెలిసిందే. ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగిపోయి 2019 ఎన్నికల్లో ఓడించారు.

ఎల్లో మీడియా ప్రచారాన్ని చంద్రబాబు నమ్ముకుంటే మాత్రం మళ్లీ ఎదురుదెబ్బలు తగలడం గ్యారంటీ అని చెప్పవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా చంద్రబాబు మారాల్సి ఉండగా ఆయన ఏ మాత్రం అప్ డేట్ కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఇవే తప్పులను పునరావృతం చేస్తే 2019 ఎన్నికల ఫలితాలు మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.