ఏం కామెడీ సేస్తిరి.! పోలవరం చంద్రన్న నాటిన మొక్క అట.!

పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాటిన మొక్క అట.! విన్నారా.? ఇది విన్నారా.? సరే, చంద్రబాబు చెప్పిందే నిజమనుకుందాం. మొక్క నాటారు, మరి నీళ్ళు పొయ్యలేదేం సరిగ్గా.? చంద్రబాబుకి వయసు మీద పడే కొద్దీ మతిపోతున్నట్టుంది.. అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అందుకు తగ్గట్టే ఆయన మతిలేని వ్యాఖ్యలు చేస్తుంటారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు ప్రయత్నించారు. నిజానికి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే ముందే పోలవరం ప్రాజెక్టుకి బీజం పడింది. జలయజ్ఞంలో పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. అయితే, ఆ జలయజ్ఞం కాస్తా ధనయజ్ఞం అయిపోయిందన్నది వేరే చర్చ.

చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా మార్చారు.. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ధనయజ్ఞం చేశారు.. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు పనుల్ని వైఎస్ జగన్ రివర్స్ చేసేశారు.. ఇవన్నీ రాజకీయ విమర్శలే. ఒకదాన్ని మించిన రాజకీయ విమర్శ ఇంకోటి. కానీ, పోలవరం ప్రాజెక్టుని మాత్రం రాజకీయ గ్రహణం వీడటంలేదు.

చంద్రబాబు విషయానికొస్తే, ఆయన తీరే అంత. సెల్‌ఫోన్ తానే కనిపెట్టానంటాడు.. కంప్యూటర్ ఘనత కూడా తనదేంటాడాయన. ఇవే, ఇలాంటి వ్యాఖ్యలే టీడీపీ శ్రేణుల్లోనూ ఆయనంటే అనుమానం కలిగేలా చేస్తుంటాయ్. కానీ, చంద్రబాబు సొంత డబ్బా మాత్రం మానరుగాక మానరు. పోలవరం ప్రాజెక్టు చరిత్ర చదివితే, అప్పుడెప్పుడో బ్రిటిషర్లు ఆ ప్రాజెక్టు గురించిన ఆలోచన చేశారనే విషయం చంద్రబాబుకి తెలుస్తుంది.