ఆంధ్రప్రదేశ్ టిడిపి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీని మీద అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారణకు అదేశించింది. అయితే, ఎమ్మెల్యేని కాపాడటానికే సీబీసీఐడీ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించిందని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. దీనిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ ఏర్పాటుచేసింది. ఈ కమిటి ఆరోపణల మీద విచారణ జరిపింది. అనంతరం కేవలం సిబిఐ ఎంక్వయిరీ మాత్రమే నిజానిజాలను వెల్లడించడగలని పార్టీ భావిస్తున్నది. సీబీఐని కలిసి అక్రమ మైనింగ్ మీద ఫిర్యాదు చేస్తామన్న పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేశ్ రెడ్డి చెప్పారు. వీడియో