పార్టీల పునాదులు కదల్చడంపై దృష్టి పెట్టిన వైసీపీ.. దబిడి దిబిడే అంటూ?

2024 ఎన్నికల్లో గెలవడమే ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని పార్టీల టార్గెట్ అనే సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం అన్ని పార్టీలు ఎంతగానో కష్టపడుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీల పునాదులు కదల్చడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే వైసీపీ కుప్పంలో చంద్రబాబు గెలవకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ ఎక్కడినుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ను ఓడించాలని వైసీపీ భావిస్తుండటం గమనార్హం. అదే విధంగా ఈ రెండు పార్టీల ముఖ్యనేతలను సైతం వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఈ రెండు పార్టీల ముఖ్య నేతలు సైతం ఎన్నికల్లో గెలవకుండా వైసీపీ అడుగులు వేస్తోంది. పార్టీల పునాదులు కదల్చడంపై వైసీపీ దృష్టి పెట్టడం గమనార్హం. ఆయా నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం ద్వారా వైసీపీ ఇతర పార్టీలకు షాకిస్తోంది.

హిందూపురం నియోజకవర్గంలో కూడా బాలకృష్ణ గెలవకుండా వైసీపీ అడుగులు వేస్తుండటం గమనార్హం. మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు సర్వేలలో పాజిటివ్ అభిప్రాయం ఏర్పడని వారికి టికెట్ ఇవ్వనని జగన్ తేల్చి చెబుతున్నారని సమాచారం అందుతోంది.

2024 ఎన్నికలలో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి వైసీపీ సిద్ధపడటం లేదు. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏం చేయాలో అన్నీ చేయడానికి వైసీపీ సిద్ధమవుతోంది. జగన్ మరో పాతికేళ్ల పాటు తనే ఏపీకి సీఎంగా ఉండే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరెవరికి టికెట్లు దక్కుతాయో ఎవరెవరికి టికెట్లు దక్కవో ఇప్పటికే వైసీపీ నుంచి ఆయా ఎమ్మెల్యేలకు స్పష్టమైన సమాచారం అందిందని తెలుస్తోంది.