ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గతంలో ఎవరూ ఎపుడూ ప్రయోగించని భాషను వాడి దాడి చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి, . చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మారుస్తున్నారు,’ అని విమర్శించారు.
అంటే చంద్రబాబు నాయుడు ఆడ కాదు, మగ కాదు,నపుంసకుడూ కాదు, ఆయన నాలుగో రకం, ఫోర్త్ జండర్ అని విజయసాయి అన్నారు..
చంద్రబాబు నాయుడు ఓవైపు బిజెపి తో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని విజయసాయి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు అన్న మాటలను ఆయన ఉదహరించారు. ఆ రోజు ఆవిశ్వాసం వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకుని చేస్తున్న పనేమిటి అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆవిశ్వాస తీర్మానం మీద తమ స్టాండ్ గురించి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఏపీకి ప్రత్యేక హోదా కోరుకుంటోందని, ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు.
‘తెలుగుదేశం దొంగల పార్టీయే అయినా బీజెపికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానికి మద్దతు ఇస్తాం.లోక్‌సభలో తమ సభ్యులు లేనప్పటికీ సంఘీభావం తెలియజేస్తున్నాం,’ అని విజయసాయిరెడ్డి అన్నారు.