జగన్ పై దాడిచేసిన కత్తికి విషం పూశారేమో : రోజా

జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే రోజా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జగన్ పై దాడికి వాడిన కత్తికి ఏమైనా పూశారేమోనని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నవ్వుతూ వచ్చి సెల్ఫీ దిగి పొడిచిన పరిస్థితి చూస్తుంటే ఇది పక్కా ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు. ఎయిర్ పోర్టు లోని  ఆ క్యాంటీన్ ఎవరిది? ఆ అబ్బాయికి ఎవరు ఉద్యోగం ఇప్పించారు? అన్నది తేలాలన్నారు. రోజా మాట్లాడిన మరిన్ని అంశాలను చదవండి. 

ప్లాన్ ప్రకారమే ఈ హత్యాయత్నం జరిగింది. ఎవరో కావాలనే చేయించారని అర్తమవుతున్నది.

గతంలో ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్న సమయంలో  ఇదే ఎయిర్ పోర్టులో జగన్ ను రన్ వే మీద నిర్బందించారు.

ఒక ప్రతిపక్ష నేతకు రక్షణ లేదంటే సామాన్యులు ఎలా బతకాలి అని ప్రశ్నిస్తున్నాను.

రాజకీయంగా తొక్కేయాలన్న దురుద్దేశంతోనే ఈ ప్రయత్నం చేశారని అర్థమవుతున్నది.

గతంలోనే ఆయనను మొగ్గలోనే తుంచేయాలని జైల్లో పెట్టారు.

నేడు హత్యాయత్నానికే ప్రయత్నం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఒక వెయిటర్ కత్తి తీసుకుని తిరుగుతున్నాడంటే పోలీసులు చేతులకు గాజులు తొడుక్కుని తిరుగుతున్నారా?

మనం ఎయిర్ పోర్టులోకి పోతే ఎన్ని రకాలుగా చెకింగ్ లు చేసి లోపలికి పంపుతారు.

ఆ క్యాంటిన్ ఎవరిది? ఆ అబ్బాయికి ఉద్యోగం ఎవరిచ్చారు. అన్ని విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది.

నేడు పుట్టిన బిడ్డ కానుంచి ముదుసలి వరకు ఎవరికీ ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేకుండాపోయింది.

నిఘా వ్యవస్థ ఫెయిల్ అయిందని అర్థమవుతుంది.

జగన్ కు భుజానికి పెద్ద గాయమైంది. ఆయన తప్పించుకున్నారు కాబట్టి సరిపోయింది.

కొన్ని చానెళ్లలో పోర్క్ తో పొడిచాడని ప్రచారం చేస్తున్నారు.

కోళ్ల పందాల్లో వాడే కత్తిని పట్టుకుని పోర్క్ అని కొన్ని చానెళ్లు ప్రచారం చేయడం దారుణం.

చంద్రబాబు నాయుడికి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను.

జగన్ గారికి ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తేల ేదు.

ఈ దాడి వెనుక ఎవరున్నారనేదాన్ని బయట పెట్టాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి.

మరో గంటలో జగన్ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆసుపత్రికి తీసుకుపోయి ట్రీట్ మెంట్  ఇప్పిస్తాం.

జగన్ మేము చెప్పినా వినడు. ప్రజలంటే ఆయనకు పిచ్చి. వాగుల్లో వంకల్లో జగన్ పర్యటిస్తున్నాడు. 

పోలీసుల మద్యలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కాపాడలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

ఈ దాడికి దిగిన వ్యక్తిని చూస్తే నవ్వుతూ సెల్ఫీ దిగాడు. ఆ తర్వాతనే దాడి చేశాడు. అంటే ఈ దాడి పక్కాగా స్కెచ్ తో జరిగిందని తెలుస్తోంది.

ఈ దాడి ఎవరు చేయించారు? వెనుక ఉన్న శక్తులేమిటి అన్నది తేలాలి. సమగ్ర విచారణ జరపాలి. లేదంటే టిడిపి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడతాం.

ఒక మనిషి ఎయిర్ పోర్టులో కత్తితో తిరుగుతున్నాడంటే పోలీసులు ఏం చేస్తున్నారు? 

ఆ కత్తికి ఏమైనా విష రసాయనాలు పూశారేమోనని మాకు ఆందోళనగా ఉంది.

వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు ఇప్పటికైనా కండ్లు తెరవాలి.

ప్రజా నాయకుడైన ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. 

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఫెయిల్యూర్ అనే చెబుతాము. నామీద ఎన్ని రకాల దాడులు జరిగాయో మీరంతా చూశారు.

నాకు ఇచ్చింది వన్ ప్లెస్ వన్. ఒకరుంటే ఇంకొకరు ఉండరు.

నా జిల్లాలో రౌడీలకు వెధవలకు నలుగురు నలుగురు గన్ మెన్లను ఇచ్చారు. నగరి జాతరలో నా మీద దాడి జరిగింది. నా చేయి తెగిపోయింది. రక్తం వచ్చింది.

అయినా ఆ కేసును క్లోజ్ చేశారు. 

ప్రతిపక్ష నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తారు. రాకపోతే దాడులకు దిగుతారు. 

దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది వాళ్లు కనుక్కోవాలి. మేము కూడా కనుక్కుంటాము. కానీ దాడి చేసిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు.  

జగన్ పై దాడి చేసిన వ్యక్తి వీడియో కింద ఉంది చూడండి.