టార్గెట్ చెవిరెడ్డి..దెబ్బలకు స్పృహ తప్పిన ఎంఎల్ఏ

చంద్రగిరి వైసిపి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తెలుగుదేశంపార్టీ టార్గెట్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకనే మొన్న జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో నేరుగా ఎంఎల్ఏపైనే దాడి చేశారు. దాంతో దెబ్బలకు చెవిరెడ్డి వేదికపైనే స్పృహ తప్పిపడిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రభుత్వం పసుపు కుంకుమ అంటూ డ్వాక్రా మహిళలకు ఓ కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే కదా.  సరే వైసిపితో పాటు మహిళలు కూడా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారనుకోండి అదివేరే సంగతి. మహిళలకు ప్రభుత్వం తలా రూ. 10 వేలు ఖాతాల్లో వేస్తానని చంద్రబాబునాయుడు చెప్పారు. అందులో భాగంగా కార్యక్రమాన్ని రాష్ట్రమంతా పెద్ద ఎత్తున చేస్తున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలంలో కూడా కార్యక్రమం జరిగింది. ఎలాగూ ఇది ప్రభుత్వ కార్యక్రమమే కాబట్టి ఎంఎల్ఏ హోదాలో చెవిరెడ్డి పాల్గొన్నారు. వేదిక మీద చెవిరెడ్డి మాట్లాడటం మొదలుపెట్టగానే టిడిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. పార్టీ కార్యక్రమంలో ప్రతిపక్షం ఎంఎల్ఏకి ఏం పనంటూ గోల మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పార్టీది కాదని ప్రభుత్వ కార్యక్రమమని ఎంఎల్ఏతో పాటు అధికారులు కూడా ఎంత చెప్పినా టిడిపి శ్రేణులు వినిపించుకోలేదు.

వేదికమీద ఉన్న చెవిరెడ్డికి కిందున్న నేతలకు పెద్ద వాగ్వాదం జరిగింది. దాంతో కొందరు హఠాత్తుగా వేదికమీదకు ఎక్కి ఎంఎల్ఏ చేతిలోని మైకును లాగేసుకున్నారు. దాంతో పెద్ద గొడవ జరిగింది. దాంతో ఇరువైపులా ఘర్షణ జరగటంతో చెవిరెడ్డికి బాగా దెబ్బలు తగిలాయి. తగిలిన దెబ్బలతో చెవిరెడ్డి వేదిక మీదే స్పృహ తప్పిపడిపోయారు. వేదికమీదే ఎంఎల్ఏ పడిపోగానే పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

దాంతో కార్యక్రమం రసాబాసగా మారిపోయింది. స్పృతప్పిన ఎంఎల్ఏని వైసిపి నేతలు రుయా ఆసుపత్రికి తరలించారు లేండి. ప్రాణాపాయం ఏమీ లేకపోయినా ఎంఎల్ఏపై దాడి చేయటం, స్పృహ తప్పేట్లు కొట్టటం చూస్తే టిడిపి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలాగుందో అర్ధమవుతోంది. విచిత్రమేమిటంటే, ఎంఎల్ఏతో పాటు తిరుపతి వెస్ట్ డిఎస్పీ, ముత్యాలరెడ్డి పల్లి సిఐ, ముగ్గురు మళిళా కానిస్టేబుళ్ళకు కూడా గాయాలయ్యాయి.  గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఎంఎల్ఏను వైసిసి నేతలు పారమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా ఇదేదో టిడిపి కార్యక్రమం లాగ నిర్వహించటమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది.