AP: ఏపీలో ఫ్లెక్సీ వార్… కొట్టుకున్న వైకాపా కూటమి కార్యకర్తలు!

AP: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రాజకీయ వివాదాలకు కూడా కారణమైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ వైకాపా నాయకులకు మద్దతు తెలిపినప్పటి నుంచి కూడా కూటమి నేతలు అభిమానులు ఈయనని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వైకాపా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలైన సందర్భంగా కొన్నిచోట్ల ఫ్లెక్సీలు వివాదాలకు కూడా కారణమయ్యాయి.

ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద వైయస్ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ఉన్నటువంటి ఫ్లెక్సీలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.బన్నీతో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో రాళ్లు, కర్రలు, వేడి నీటితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఇక ప్రస్తుతం శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది ఒక పోలీసులు కూడా ఈ పరిస్థితిని అదుపు చేసే క్రమంలో ఉన్నారు. ఇలా అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కనిపించడంతో వివాదానికి కారణం అయితే ఈ ఘటనపై పలువురు విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్ బాలయ్య సినిమాలు విడుదల సమయంలో చంద్రబాబు నాయుడు లోకేష్ వారి ఫోటోలు కూడా వేస్తున్నారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇకపోతే థియేటర్ల లోపల కూడా వైకాపా అభిమానులు తీవ్రస్థాయిలో రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ వైకాపాకు సపోర్ట్ చేయడంతో ఇప్పుడు కూడా వైకాపా అభిమానులు ఈ సినిమాకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే పలు థియేటర్లలో ఏకంగా వైసీపీ జెండాలతో అభిమానులు సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.