ఫేక్ ప్రచారంతో పరువు పోగొట్టుకుంటున్న వైసీపీ.. ఈ ప్రచారాలు అవసరమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు సైతం సంతృప్తితో ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన సైతం జగన్ కు లేదనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా వైసీపీ హవా మరింత పెరిగే విధంగా సోషల్ మీడియా కోసం వైసీపీ కొంతమంది నియమించుకున్న సంగతి తెలిసిందే.

ఇలా నియమించుకున్న వాళ్లు టీడీపీ సీనియర్ నేతలు వైసీపీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీలో చేరబోతున్నట్టు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు చేసిన ప్రచారం ఆ పార్టీ పరువు తీసింది. స్వయంగా ప్రత్తిపాటి పుల్లారావు స్పందించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

వాస్తవానికి టీడీపీ సైతం సీనియర్ నేతలను వదిలించుకోవాలని భావిస్తోంది. అయితే డైరెక్ట్ గా సీనియర్ నేతలను పంపించకుండా సీనియర్ నేతలే సొంతంగా పార్టీ నుంచి వెళ్లిపోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. వైసీపీకి ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వడం కష్టమవుతోంది. కొత్తగా మరి కొందరు నేతలు చేరితే వాళ్లకు కూడా టికెట్లను కేటాయించడం వైసీపీకి సులువు కాదనే సంగతి తెలిసిందే.

ఇలాంటి సమయంలో టీడీపీ సీనియర్ నేతలను వైసీపీ చేర్చుకోవడం వల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదనే సంగతి తెలిసిందే. ఈ తరహా ఫేక్ ప్రచారాలు ఒక విధంగా వైసీపీ పరువు పోవడానికి కారణమవుతున్నాయి. వాస్తవాలను గ్రహించి వైసీపీ పాలన సాగిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.