రాజధాని జిల్లాగా గుర్తపుసాధించిన గుంటూరు జిల్లాను వైసీపీ నాయకులు పంచేసుకున్నారా? జిల్లాను విభజించి పాలించు అనే సూత్రంతో ముందుకెళ్తున్నారా? అంటే అవుననే సమాచారం అందుతోంది. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన పై దృష్టి సారించారే తప్ప పార్టీని పట్టించుకోలేదని కొన్ని నెలలుగా విమర్శలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రులకు..ఎమ్మెల్యేలకు చివరికి అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వకుండా అంతా తానై…అన్నీ తానై చూసుకుంటున్నారని..ఇలాగైతే తమ నియోజక వర్గాల పరిస్థితి ఏంటని? గుసాయించిన సంగతి తెలిసిందే.
దాదాపు అన్ని జిల్లాల్లోనూ…నియోజక వర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఇక లాభం లేదనుకున్నారో ఏమోగానీ! గుంటూరు జిల్లాను మాత్రం వైసీపీ నేతలు పంచేసుకుని..విభజించి పాలిస్తున్నట్లు వెలుగులోకి వస్తోంది. చిలకలూరి పేట నియోజక వర్గం పూర్తిగా విడదల రజనీ అండర్ లోనే ఉందని..స్థానికంగా ఏ పని జరగాలన్నా రజనీ మాత్రమే కీలకంగా ఉన్నారని అంటున్నారు. తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు వంటి ఎస్సీ నియోజక వర్గాల్లోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారుట. నియజక వర్గాల్లో నాయకుల మధ్య ఆధిపత్య పోరు జోరుగా సాగుతోందని ఈ కుంపటి నుంచే జిల్లా మొత్తానికి ఎసరొచ్చిందని అంటున్నారు.
ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా సరిద్దిద్దకపోతే పరిస్థితులే మారిపోయతాని నియోజవ వర్గాల నుంచి రిపోర్ట్ అందుతోంది. నిజమే ఇప్పటికే రాజధాని తరలింపు నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజక వర్గాల్లో వైసీపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. సొంత జిల్లా వైసీపీ నేతలు తక్షణం పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజధాని జిల్లాల్లోనే వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరు అంటే ఎంత వరకూ దారి తీస్తుందో చెప్పడం కష్టమే. ఇవన్నీ పార్టీని క్షేత్ర స్థాయిలో దెబ్బకొట్టే ప్రతికూల అంశాలేనని చెప్పాల్సిన పనిలేదు.