2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళడానికి రెడి అవుతున్నారు. ఇప్పటికే వంశీ వైసీపీ నేతగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీపై చేస్తున్న వ్యాఖ్యలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున టీడీపీ నేతలను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడును గతంలో చేసిన తప్పులను కూడా మీడియా ముందు చెప్పడానికి కూడా వంశీ వెనుకాడటం లేదు. మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో రైతుల పట్ల గతంలో చంద్రబాబు చేసిన తప్పులను మీడియా ముందు చెప్తూ అందరిని ఆశ్చర్య పరిచాడు. అయితే ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశం అయింది.
జగన్ ను అవమానించిన వంశీ
రాజీనామాకు భయపడుతున్నారా ? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు వంశీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైసీపీ నేతల్లో ఆగ్రహం తెప్పించాయి. 2019 ఎన్నికల్లో నేను జగన్ గాలిని కూడా తట్టుకొని గెలిచాను.. ఇప్పుడు ఒక లెక్కనా అని బదులిచ్చాడు. ఈ మాట విన్న అక్కడి వైసీపీ వాళ్లు రగిలిపోతున్నారు. వంశీకి తన బలంపై అంత నమ్మకం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీకి మద్దుతు ఇస్తూనే ఇలా జగన్ కంటే తానే గొప్పని చెప్పుకోవడం తగదని వైసీపీ నేతలు వంశీ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వల్లభనేని వంశీకి ధైర్యం ఉంటే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి స్పీకర్ తో ఆమోదించుకోవచ్చు కదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో దుబ్బాక ఎన్నిక వస్తోంది. దీంతో ఇప్పుడు రాజీనామా చేస్తే దాంతోపాటు ఎన్నికలు వస్తే వైసీపీ తరుఫున గెలిచి అధికారికంగా వైసీపీ నేతవు కావచ్చు కదా అని కొందరు హితవు పలుకుతున్నారు.