విచిత్రంగా ఉన్నా వినటానికి నిజంగా నిజం. పెడన నియోజకవర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని వైసిపి నేతే డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని 12వ వార్డు కౌన్సిలర్ డి. నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. పెడనలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని స్యయంగా వైసిపి నేతే డిమాండ్ చేయటం సంచలనంగా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, మొన్నటి ఎన్నికల్లో పెడన నియోజకవర్గంలో అభ్యర్ధి జోగి రమేష్ వైసిపి అభ్యర్ధిగా పోటీ చేశారు. గెలవటానికి బాగా డబ్బులు ఖర్చు చేశారని ఆరోపిస్తున్నారు. అందులో భాగంగా డబ్బులు పంపిణీ చేయాలని తనకు కూడా రూ 12 లక్షలు ఇచ్చారట. అయితే తాను డబ్బులు పంచనని చెప్పటంతో వాళ్ళు వెళ్ళిపోయారట.
సరే ఎన్నికలు అయిపోయిన తర్వాత తామిచ్చిన 10 లక్షల రూపాయల్లో మిగిలిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నారని కౌన్సిలర్ మండిపోతున్నారు. తానసలు డబ్బులే తీసుకోనపుడు ఇక పంపిణీలో మిగిలే ప్రశ్నే లేదుకదా అంటున్నారు.
సరే పార్టీలో డబ్బుల గోల ఇలా వుండగానే డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేశారని అరోపిస్తు మళ్ళీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేయటంతో కలకలం మొదలైంది. అదే సమయంలో తనను కిడ్నాప్ చేసి డబ్బులు అడుగుతున్నారంటూ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫిర్యాదు చేయటమే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.