‘యాత్ర’ రిలీజ్ కు ముందే షాక్, అదే ప్లస్ కూడా !

తెలుగు పరిశ్రమలో తెర‌కెక్కుతున్న క్రేజీ బ‌యోపిక్స్‌లో యాత్ర ఒక‌టి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మహి.వి రాఘవ తెర‌కెక్కిస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న చిత్రం రిలీజ్ కు ముందే షాక్ ఇచ్చింది. ఏ విషయంలో అంటే రన్ టైమ్ విషయంలో. కేవలం 126 నిమిషాల లెంగ్త్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

మామూలుగా బయోపిక్ సినిమాలాంటే ఎక్కువ రన్ టైం ను ఎక్సపెక్ట్ చేస్తాం. అంతెందుకు రీసెంట్ గా రిలీజైన ఎన్టీఆర్ కథానాయకుడు లెంగ్త్ 2 గంటల 56 నిముషాలు ఉంది. దాంతో ఈ సినిమా ప్లాఫ్ కి నిడివి ఎక్కువ వుందన్నకారణం కూడా ఒకటైంది. ఈ ప్రభావం ఆ సినిమా ఫలితం ఫై పడింది. దాంతో యాత్ర రన్ టైం విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం రెండు గంటల ఆరు నిమిషాల్లో సినిమాను పూర్తి చేసేస్తున్నారు. దాంతో ఈ సినిమాకు ఇదే ప్లస్ గా మారనుందంటున్నారు.

ఇక సినిమా ప్రారంభం అవ్వడమే వైఎస్సార్ పాదయాత్ర తో స్టార్ అవుతుందని సమాచారం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు తమిళ , మలయాళ భాషల్లో విడుదలకానుంది.

ఈ సినిమాలో రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్‌ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్‌ కనిపించనున్నారట. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది. అయితే ఈ మూవీ రిలీజ్‌పై అభిమానుల‌లో అనేక సందిగ్ధాలు నెల‌కొన‌గా ఫిబ్ర‌వ‌రి 8న చిత్ర రిలీజ్‌కి ప్లాన్ చేశారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్ష‌కులని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు.