దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రనే ప్రధానంగా చూపించనున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ప్రారంభించింది. అందులో భాగంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సూటిగా, సింపుల్ గా చక్కగా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి.
ముఖ్యంగా డైలాగులు అప్ టుది మార్క్ ఉండి…ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకోగలిగాం కానీ జనాలకు ఏం కావాలో తెలుసుకోలేకపోయాం.. తెలుసుకోవాలని ఉంది. వినాలని ఉంది. ఈ కడపదాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది..’ అని మమ్ముట్టి చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ‘అన్నింటికన్నా అతి పెద్ద జబ్బు క్యాన్సరో, గుండెజబ్బోకాదయ్యా.. పేదరికం.. పేదరికాన్ని మించిన శిక్షేలేదయ్యా..’ అనే వచ్చే డైలాగులు బాగున్నాయి. దర్శక,నిర్మాతలు ఏదైతే హైలెట్ చేయాలనుకుంటున్నారో వాటిపైనే దృష్టి పెట్టారని అర్దమవుతోంది.
70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మహి వి రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.