కార్యకర్తలకు సారీ… వైసీపీకి యార్లగడ్డ గుడ్ బై!

గతకొంతకాలంగా గన్నవరం వైసీపీలో కొత్త రచ్చ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో గెలిచిన అనంతరం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫ్యాన్ కిందకి చేరిపోగా.. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ సడన్ గా తెరపైకి వచ్చి ఇష్యూ సీరియస్ చేశారు!

అవును… రాబోయే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరుపున వల్లభనేని వంశీ పోటీచేస్తారనే కామెంట్లు వినిపిస్తోన్న నేపథ్యంలో… రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరంలో పోటీచేసేది తానే అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన ప్రకటన చేశారు. దీంతో నాటి నుంచి గన్నవరం వైసీపీ టిక్కెట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయంలో జగన్ హామీ వంశీకి ఉందని అంటున్నారు. ఈ సమయంలో యార్లగడ్డాకు ప్రత్యామ్నాయ స్థానం కాని, ఎమ్మెల్సీ కానీ ఇస్తున్నట్లు జగన్ హామీ ఇచ్చారనే కామెంట్లు వినిపించాయి. అయితే ఇందుకు యార్లగడ్డ ససేమిరా అన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయం దిశగా ఆలోచిస్తున్నారని.. ఆ విషయంలో ఇప్పటికే ఒక కన్ క్లూజన్ కి వచ్చేశారని అంటున్నారు.

ఈ క్రమంలో… ఇవాళ తన అనుచరులతో మరోసారి భేటీ అయిన యార్లగడ్డ వెంకట్రావు.. వైఎస్సార్సీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పారు. నాయకులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీ చేసానని ఆయన గుర్తుచేసుకున్నారు. అవమానాల కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లైందని అన్నారు. గన్నవరంలో వైసీపీ గెలవడమే ద్యేయంగా పనిచేశానని తెలిపారు.

అయితే ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో తనకే టిక్కెట్ ఇవ్వమని మాత్రమే సీఎంను అడిగానని చెప్పినట్లు తెలిపారు. అయితే పార్టీ పెద్దలకు ఏమి అర్ధమైందో తనకు తెలియదని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారైతే పరిస్థితి ఇలా ఉండేది కాదని అందరూ చెప్పారని వెంకట్రావు తెలిపారు.

ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినా తమపై కేసులు కొనసాగాయని యార్లగడ్డ వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డను ఎక్కడైనా సర్దుబాటు చేస్తుందని సజ్జల ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు. ఉంటే ఉండు.. పోతే పో అన్నట్లుగా సజ్జల చెప్పడం తనకు చాలా బాధ, ఆవేదన కలిగించిందని యార్లగడ్డా తెలిపారు. టీడీపీ కంచుకోటలో ఢీ అంటే ఢీ అని పోరాడానని యార్లగడ్డ గుర్తుచేసుకున్నారు.

ఇదే సమయంలో ఇంతవరకూ చంద్రబాబు ను లోకేష్ ను.. టీడీపీలో ఎవరినీ తాను కలవలేదని… తనను ఎంతమంది కలవాలని ప్రయత్నం చేసినా ఛాన్స్ ఇవ్వలేదని యార్లగడ్డ చెప్ప్పుకున్నారు. తాను టీడీపీ నేతలను కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. అయితే… త్వరలో చంద్రబాబును కలుస్తానని.. తనకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ఆయన మీడియా ముఖంగా కోరారు.

#@AKnewsworld వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు రాజీనామా.