అమ్మాయి ఫోటోలు తీసి వాట్సాప్ లో పెట్టి…చివరికి ఏమైందంటే (వీడియోలు)

ఓ యువతి… ఒక యువకుడితో మాట్లాడుతుండగా బంధువయ్యే మరో యువకుడు ఫోటోలు తీశాడు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ లో పెట్టాడు. దీనికి తోడు బంధువుల సూటి పోటి మాటలతో ఆ అమ్మాయి మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన గ్యాదపాక కావ్య ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కావ్య మృతితో బంధువులు ఆందోళన చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

 

అదే గ్రామంలో ఇంటి పక్కన ఉండే గ్యాదపాక పవన్ కావ్యకు బంధువవుతాడు. ఇదే కళాశాలలో అతను కూడా చదువుతున్నాడు. 10 రోజుల క్రితం కావ్య తన క్లాస్ మేట్ తో మాట్లాడుతుండగా పవన్ ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టాడు. దానిని బంధువులకు కూడా పంపాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ నెల 24న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పెద్దలు హెచ్చరించడంతో పవన్ క్షమాపణలు చెప్పాడు.

అయితే ఈ విషయంలో పవన్ తల్లిదండ్రులు కావ్యను పలుమార్లు సూటిపోటి మాటలతో నిందించారు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య బుదవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కావ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య గురువారం మృతి చెందింది.

కావ్య మృతికి కారణమైన పవన్ ఇంటి ముందు కావ్య మృతదేహాన్ని ఉంచి కావ్య బంధువులు ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వచ్చి ఆందోళన కారులతో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు. నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.