నాగోల్ బ్రిడ్జి కింద యాదాద్రి జాఫర్ డెడ్ బాడీ (ఎక్స్ క్లూజివ్ వీడియో)

నాగోల్ బ్రిడ్జి కింద హత్యకు గురైన వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన జాఫర్ సతీష్, శివ అనే యువకులను చంపుతానని బెదిరిస్తుండటంతో భయంతో సతీష్, శివలిద్దరూ కలిసి జాఫర్ ను హత్య చేశారు. జాఫర్ వీడియో కింద ఉంది చూడండి. 

భువనగిరిలోని ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన జాఫర్ గురువారం రాత్రి 10 గంటల నుంచి కనిపించకుండాపోయాడు. దీంతో అతని చిన్నమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే రోజు రాత్రి అతని ఇంటి ముందు, రోడ్లపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. జాఫర్ హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానించారు.

ఇంతలోనే సతీష్, శివ అనే యువకులు జాఫర్ ని చంపివేశామని పోలీసుల ముందు లొంగిపోయారు. జాఫర్ తమను  చంపుతామని బెదిరించడంతో దోస్తులతో కలిసి జాఫర్ ని తీవ్రంగా కొట్టి చంపామని తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాగోల్ బ్రిడ్జి కింద జాఫర్ శవాన్ని గుర్తించారు. సతీష్ శివల పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పాత కక్ష్యలే హత్యకు కారణమని తేలింది.