భర్త పై కోపం , ప్రియుని పై మోహంతో కట్టుకున్న భర్తనే చంపేసింది. ఎంత పక్కాగా అంటే కనీసం ఆధారాలు లేకుండా చేసి చంపేసింది. ప్రియునితో కలిసి ఇంట్లో ఉండగా భర్త చూశాడు. అంతే అగ్గి మీద గుగ్గిలమైన మహిళ తమ బండారం ఎక్కడ బయటపడుతుందో అని భర్తను ప్రియుడితో కలిసి చంపింది. అసలు వివరాలు ఏంటంటే..
రాజమండ్రి సమీపంలోని మల్లేపల్లికి చెందిన తోట దుర్గారావు డ్రైవర్ గా పని చేసేవాడు. అతడికి పెళ్లై పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి రాజమండ్రికి చెందిన లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తీసుకొచ్చి చందానగర్ లో కాపురం పెట్టాడు. రెండో పెళ్లి విషయం తెలియగానే మొదటి భార్య రామకృష్ణను వదిలి పెట్టి వెళ్లింది.
లావణ్య దుర్గారవు లకు కూడా ఇద్దరు పిల్లలు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన లావణ్యకు వారి బంధువు రామకృష్ణ తో పరిచయం ఏర్పడింది. దుర్గారావు బాగా తాగడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడంతో అతనికి ఎయిడ్స్ వ్యాధి సోకింది. ఈ విషయం తెలిసిన లావణ్య అతనిని దూరం పెడుతుంది. రామకృష్ణ కు కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు. లావణ్య దంపతులు కొన్నాళ్ల పాటు తమ గ్రామానికి వెళ్లారు. రామకృష్ణ తన కుటుంబాన్ని తీసుకొని నేరేడ్ మెట్ లో అద్దెకు ఉంటూ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
ఈ సమయంలో లావణ్య తన భర్తకు పని చూపించాలని రామకృష్ణను సంప్రదించగా ఓ సంస్థలో డ్రైవర్ గా పని చూపించాడు. వారి ఇంటికి సమీపంలోనే కిరాయి ఇల్లు చూపించాడు. దుర్గారావు లావణ్యను లైంగికంగా వేధించగా అతనికి ఎయిడ్స్ ఉండటంతో వ్యతిరేకించింది. ఈ క్రమంలో లావణ్య ఇంటికి రామకృష్ణ అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. రామకృష్ణకు లావణ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది.
దుర్గారావు లేనప్పుడు రామకృష్ణ లావణ్య ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇంట్లోనే వారి సంబంధాలు కొనసాగించారు. అక్టోబర్ 31 వ తేది రాత్రి లావణ్య, రామకృష్ణ ఇంట్లో సన్నిహితంగా ఉన్న సమయంలో దుర్గారావు ఇంటికి వచ్చాడు. వారు కలిసి ఉండటం చూసి లావణ్య పై దుర్గారావు కోపం వ్యక్తం చేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన లావణ్య దుర్గారావును ఇనుప నల్లా పైపుతో తల పైన కొట్టింది. అతను కింద పడగానే చున్నీతో అతని ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి చంపింది.
నవంబర్ 1 వ తేదిన రామకృష్ణ తాను పని చేస్తున్న సంస్థలోని బండి తీసుకొచ్చి అందులో దుర్గారవు శవాన్ని వేసుకొని కీసర సమీపంలోని హైవే దగ్గర చెట్లల్లో పడేశాడు. లావణ్య తన పిల్లలను తీసుకొని కాకినాడ వెళ్లి పోయింది. శవం ఉందని స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.
ఎన్నికల బిజి ఉండటంతో కేసు ముందుకు సాగలేదు. దీని పై సిపి భగవత్ ఎస్ వోటి పోలీసుల టింను ఏర్పాటు చేశారు. వారు చాలా శ్రమించి సిసి పుటేజిల ద్వారా రోజుల పాటు విచారించి ఓ ఓమ్నీ వ్యాన్ ను గుర్తించారు. టెక్నాలజీ ద్వారా దాని నంబర్ ను తెలుసుకొని డ్రైవర్లను విచారించగా రామకృష్ణ అసలు నిజం చెప్పాడు. దీంతో పోలీసులు లావణ్యను పిలిచి విచారించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అమాయకంగా కనిపించే లావణ్య ఇంత దారుణానికి పాల్పడిందని తెలిసి వారు బంధువులు షాకయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తొందరగా కేసును చేధించిన పోలీసులను సిపి అభినందించారు.