వైఎస్ఆర్ సీపీ నాయకులు వై వి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా నియమితులు అవుతున్నారు అని తెలియగానే ఆయన మతం మీద ఒక వివాదం చెలరేగింది. వై వి సుబ్బారెడ్డి క్రైస్తవుడని అందుచేత టిటిడి పాలక మండలి చైర్మన్ గా ఒక హిందువుని మాత్రమే నియమించాలని ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఈ వివాదం తెర దించడానికి వైవి సుబ్బారెడ్డి విలేకరులను తన ఇంటికి తీసుకు వెళ్లి వాళ్ల పూజించే దేవుళ్లని వారి పూజ గదిని తన మెడలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి డాలర్ ని చూపించవలసి వచ్చింది.
ఈ వివాదం సమసిపోయి శుక్రవారం రోజు వై వి సుబ్బారెడ్డి టీటీడీ పాలకమండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెయ్యితో తులాభారం వేసి దానిని శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి సమర్పించడం జరిగింది. అయితే మీడియా లో రిలీజ్ అయిన ఫోటోలను పట్టుకొని అక్కడ వాడిన నెయ్యి చంద్రబాబు కంపెనీ హెరిటేజ్ నుండి కొన్నదని, పైకి వైసిపి తెలుగుదేశం నాయకులు ఎంత విమర్శించుకున్న లోపల ఒకటేనని మధ్యలో కార్యకర్తలు మాత్రమే నలిగిపోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వెలుగు చూడడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏ చిన్న అంశం దొరికిన వివాదం చేయడానికి సోషల్ మీడియా వర్గాలు తయారై పోతున్నాయి.
అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తిరుమలలో ఇప్పటివరకైతే కేవలం హెరిటేజ్ సంస్థ యొక్క వస్తువులు మాత్రమే విక్రయించాలి. ఈ నిబంధనని పోయిన పాలకవర్గం ఆమోదించి అమలు పరుస్తుంది. అందుచేతనే తిరుమలలో వై వి సుబ్బారెడ్డి కైనా మరెవరికైనా దొరికేది హెరిటేజ్ నెయ్యి మాత్రమే.
చూస్తుంటే కవితకు కాదేది అనర్హం అన్నట్టు సోషల్ మీడియాలో వివాదం రేపడానికి కాదేది అనర్హం అయినట్లు కనిపిస్తోంది