తెలంగాణా ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ ..?

 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు జూనియర్ ఎన్టీ రామారావును దువ్వుతున్నాడా ? నందమూరి హరికృష్ణ మరణం తో ఆయన ఇద్దరు కుమారులు కళ్యాణ్ రామ్ , తారక రామారావు లను శనివారం నాడు హైదరాబాద్ లో కలసి ముచ్చటించడం తో ఈ ఊహాగానం రెండు రాష్ట్రాల్లో జోరందుకుంది . నిన్న హరికృష్ణ పెద్ద కర్మకు చంద్ర బాబు లోకేష్ ఇద్దరు హాజరయ్యారు.

హరికృష్ణకు శ్రద్ధాంజలి ఘటించిన తరువాత చంద్ర బాబు కళ్యాణ్ రామ్ , జూనియర్లతో కాసేపు మాట్లాడారు . తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలపై చంద్ర బాబు దృష్టి సారించాడు . ముందస్తు ఎన్నికలు ముంచుకొచ్చే యడంతో బాబు కాస్త కలవర పడుతున్నాడు . కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశం తెలంగాణలో పొత్తు పెట్టుకుంటుందన్న వార్తు వెలువడుతున్నాయి . దీనికి చంద్ర బాబు వ్యవహార శైలి కూడా బలాన్ని చేకూరుస్తుంది . ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ అవసరం ఎంతైనా వుంది . జూనియర్ కు రెండు రాష్టాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా గణనీయంగానే వున్నారు . అందుచేత హరికృష్ణ చనిపోయిన తరువాత జూనియర్ ఎన్టీ రామారావు కు పార్టీలో సముచితమైన స్థానం కలిపించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిసింది .

ఇక తెలంగాణాలో తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలు వున్నా నాయకత్వ లేమితో అది కుదేలైపోయింది . చంద్ర బాబు కూడా చుట్టపు చూపుగా వచ్చి పోవడం తప్ప పెద్దగా పట్టించుకోలేదు . తెలంగాణాలో పార్టీని బలిపీఠం చేసి ఎన్నికల్లో తమ సత్తా చాటాలని , చంద్ర శేఖర్ రావుకు గుణపాఠం చెప్పాలని బాబు యోచన .

ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకుడు ఎల్ . రమణ జూనియర్ ను తీసుక వస్తే మళ్ళీ ఊపు వస్తుందని బాబుకు చెబుతున్నాడు . శనివారం నాడు బాబు జూనియర్ తో మాట్లాడేటప్పుడు రమణ పక్కనే వున్నాడు . బాబు కూడా ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నాడు .

చాలా కాలంగా హరికృష్ణ, జూనియర్ తారక రామారావు ఇద్దరు తెలుగు దేశం పార్టీకి దూరంగానే వుంటున్నారు . హరికృష్ణ మరణంతో బాబు ద్రుష్టి జూనియర్ మీద పడిందని అంటున్నారు . జూనియర్ కు సినిమా తప్ప రాజకీయాలు పట్టవు. .గతంలో కూడా తన తాత నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ , తన తండ్రి హరి కృష్ణ రాజకీయాల్లో వున్నాడు కాబట్టి 2009లో ప్రచారం చేశాడు . 2014 ఎన్నికల్లో బాబు బిజెపి తో కలసి పోటీ చేశాడు . నరేంద్ర మోడీ తో పాటు పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల బాబు జూనియర్ ను పట్టించుకోలేదు .మారిన పరిస్థితుల్లో మోడీ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా దూరమయ్యారు . ఇప్పుడు తారకరామారావు అవసరం బాబుకు ఎంతో వుంది . జూనియర్ కు కూడా తండ్రి పోవడం తో కొంత అండ పోయిందని బాధపడుతున్నాడు . ఇప్పుడు మావయ్య చంద్ర బాబును కూడా దూరం చేసుకుంటే ఒంటరిగా మిగిలి పోతానేమో అని భయం పట్టుకుంది . మావయ్య చంద్ర బాబు మాట వింటే బాబాయి బాల కృష్ణ కూడా దగ్గరయ్యే అవకాశం వుంది . జూనియర్ కు ఇదే కావాలి .

అందుకే తారక రామారావు చంద్ర బాబు కు దగ్గరవుతున్నారు . జూనియర్ సుముఖంగా ఉండటం బాబులో కొత్త ఉత్సహం వచ్చింది . తెలంగాణా ఎన్నికల్లో జూనియర్ ప్రచారం చేసే అవకాశం వుంది . దీనివల్ల పార్టీలో కూడా నూతన ఉత్తేజం వస్తుందని చెప్పవచ్చు .!