కుటుంబంలో నెలకొన్న వివాదాలు ఆ వివాహిత ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. నల్లగొండ పట్టణానికి చెందిన మహిళకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. గత కొంత కాలంగా ఇంట్లో భార్య భర్తల మధ్య తరచు విబేధాలు వస్తున్నాయి. దీంతో అసంతృప్తికి గురి అయిన మహిళ నల్లగొండ నుంచి స్కూటి పై మిర్యాలగూడ శెట్టిపాలెం సాగర్ కెనాల్ దగ్గరకు వచ్చింది. అక్కడ స్కూటి ఆపి కాల్వలోకి దూకింది. అదే సమయంలో అక్కడి నుంచి వెళుతున్న యువకులు చూసి ఆమెను కాపాడారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పక్కనే ఉన్న కూలీలు కూడా వచ్చి ఆమెకు సపర్యలు చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.